Gold News: రొమాంటిక్ కాల్‌తో దొరికిన గోల్డ్ దొంగ.. కోట్లు విలువైన బంగారు ఇటుకల స్వాధీనం..
Gold News: ఎలాంటి దొంగైనా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. దొంగిలించటంలో తెలివి ఉన్నప్పటికీ టెక్నాలజీ వల్ల చివరికి పోలీసులకు చిక్కుతారని మరో సారి రుజువైంది.
విషయంలోకి వెళితే పక్కా ప్లాన్‌తో ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో అపు భూయాన్ అనే నిందితుడు విజయవంతంగా దొంగతనం చేశాడు. అయితే ఇతని కథలో టెక్నాలజీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే మనోడు ప్రియురాలితో ఇన్‌స్టాగ్రామ్ కాల్స్ ద్వారా సంభాషిస్తున్నాడు. ఇది పోలీసులకు పెద్ద వరంగా మారింది.

ప్రియురాలితో తాను నివసిస్తున్న లొకేషన్ వివరాలను పంచుకున్నాడు. దీంతో ఈ గజదొంగను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో ఒక గ్రామం నుంచి పోలీసులు 3 బంగారు ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ జరిగిన తర్వాత వ్యాపారవేత్త సునీల్ అనేజా ఫిర్యాదు తర్వాత ఇన్స్పెక్టర్ దీపక్ మాలిక్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభమైంది. దొంగిలించబడిన బంగారు ఇటుకలను డెలివరీ చేసే బాధ్యతను భూయాన్‌కు అప్పగించారు. కానీ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అతను అదృశ్యమయ్యాడు.
భూయాన్ తన స్వగ్రామంలో పట్టుబడకుండా తప్పించుకోగలిగినప్పటికీ.. అతను సైబర్ టెక్నిక్‌లలో నైపుణ్యం కలిగి ఉన్నాడని, దొరక్కుండా తప్పించుకునే తెలివి అతడికి ఉన్నట్లు పోలీసులు గమనించారు. దీంతో అతడి డిజిటల్ కార్యకలాపాలను ట్రాక్ చేయటం ప్రారంభించారు. బంధువులు, స్నేహితులపై నిఘా పెట్టారు. అలా జూలై 10న భుయాన్ తన స్నేహితురాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు తెలియకుండానే సంప్రదించి డెహ్రాడూన్‌లో తన లొకేషన్‌ను వెల్లడించడంతో కథ మలుపు తిరిగింది. IP వివరాల రికార్డులను ఉపయోగించి పోలీసుల బృందం డెహ్రాడూన్‌లో అతన్ని పట్టుకుంది.


Click it and Unblock the Notifications