గత మూడేళ్లుగా భారతదేశ హౌసింగ్ మార్కెట్‌లో పెద్ద మార్పు వచ్చింది. లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు బాగా పెరిగాయి. తాజాగా ANAROCK విడుదల చేసిన డేటా ప్రకారం.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ప్రముఖ నగరాలను దాటి.. ఒక నగరం దాదాపు అన్ని బడ్జెట్ విభాగాలలో అత్యధికంగా గృహాల ధరల పెరుగుదలను నమోదు చేసింది. అదేంటంటే..

2022 నుండి 2025 మధ్యకాలంలో లగ్జరీ, మిడ్-రేంజ్ ఇంకా బడ్జెట్ గృహాల విభాగాలలో దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే ఢిల్లీ ఎన్‌సీఆర్ (Delhi NCR) అగ్రస్థానంలో ఉంది. ఈ అనూహ్య వృద్ధి భారతీయ real estate మార్కెట్‌లో ప్రధాన కేంద్రంగా ఎన్‌సీఆర్‌ను నిలబెట్టింది.
లగ్జరీ ఇళ్లకు డిమాండ్
ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గత మూడేళ్లలో అగ్రగామి ఏడు నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు సగటున 40% పెరిగాయని ANAROCK రిపోర్ట్ లో తేలింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (Delhi NCR) లో అయితే లగ్జరీ ఇళ్ల ధరల పెరుగుదల ఏకంగా 72% పెరిగింది. ఈ పెరుగుదల ముంబైలో 43%, బెంగళూరు (Bengaluru) లో 42%, హైదరాబాద్ (Hyderabad) లో 41%గా ఉంది. ఈ విపరీతమైన పెరుగుదల ఎన్‌సీఆర్‌ను ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), బెంగళూరు వంటి ఖరీదైన మార్కెట్ల కంటే ముందు నిలబెట్టింది. MMR ఇప్పటికీ అత్యంత ఖరీదైన లగ్జరీ మార్కెట్‌గా ఉన్నప్పటికీ.. ధరల పెరుగుదల వేగంలో మాత్రం ఎన్‌సీఆర్ అగ్రస్థానం దక్కించుకుంది.
మిడ్-రేంజ్ విభాగంలోనూ ఇదే టాప్
రూ.40 లక్షల నుండి రూ.1.5 కోట్ల మధ్య ధర కలిగిన మిడ్-రేంజ్ ఇళ్ల విభాగంలో కూడా ఢిల్లీ ఎన్‌సీఆర్ 54% పెరుగుదలతో ముందంజలో ఉంది. ఈ విభాగంలో బెంగళూరు 62% , హైదరాబాద్ 49% పెరుగుదలను చూశాయి.
బడ్జెట్ ఇళ్ల విభాగంలో..
ఇకపోతే రూ. 40 లక్షల కంటే తక్కువ ధర ఉన్న సరసమైన గృహాల విభాగం మాత్రం దేశవ్యాప్తంగా నెమ్మదిగా వృద్ధిని నమోదు చేసింది. కేవలం 26% మాత్రమే ఉంది. డిమాండ్ తక్కువగా ఉండటం, కొత్త ప్రాజెక్ట్‌లు తక్కువగా ప్రారంభించడం దీనికి కారణం. అయినా ఇక్కడ కూడా ఎన్‌సీఆర్ మినహాయింపుగా నిలిచింది. ఎన్‌సీఆర్‌లో సరసమైన గృహాల ధరలు 48% పెరిగాయి. ఆ తర్వాత 35% వృద్ధితో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. మొత్తం real estate మార్కెట్‌పై ఎన్‌సీఆర్ ఆధిపత్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
ఢిల్లీ ఇంత బలంగా ఎందుకు ఉంది?
పొల్యూషన్ కు, జన సాంద్రతకు ఢిల్లీ పెట్టింది పేరు. ఇక్కడ నివసించడానికి పెద్దగా ఇష్టపడరు అని అందరూ అనుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఢిల్లీ దూసుకుపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడ ఏర్పాటుచేస్తున్న కొత్త మౌలిక సదుపాయాలు, అన్ని రకాల బడ్జెట్ లకు అనుకూలంగా ప్రాజెక్ట్ లు ఏర్పాటు చేయడం వంటివి దీనికి ప్రధానం కారణాలుగా ఉన్నాయి. డెవలపర్లు ఇప్పుడు సరసమైన గృహాలపై కాకుండా మిడ్ రేంజ్, ప్రీమియం హౌసింగ్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ అవకాశాలు ఢిల్లీలోనే ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడి మార్కెట్ వేగంగా దూసుకెళ్తుంది.
More From GoodReturns

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!

Bengaluru: ట్రాఫిక్, అద్దెలు, తిండి.. బెంగళూరు కష్టాలకు చెక్ పెట్టే 30 డేస్ రోడ్‌మ్యాప్! వీడియో వైరల్!

Bengaluru: అద్దె ఎంత పెరిగినా అక్కడే ఉంటాం! ఫ్రెండ్స్ కోసం లక్షలు వదులుకుంటున్న బెంగళూరు కపుల్!

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!



Click it and Unblock the Notifications