డేటింగ్ యాప్‌ల ద్వారా ప్రేమను కోరుకునే వారికి కొత్త తలనొప్పి మొదలైంది. తాజాగా ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఒక కేసు, డేటింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఢిల్లీలోని కైలాష్ ఓ కేఫ్‌లో జరిగిన డేట్‌లో రూ.12,000 స్కాం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం చిన్న సంఘటన కాదు, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక పెద్ద మోసంలో భాగం.

డేటింగ్ యాప్‌తో మొదలై : ఢిల్లీకి చెందిన ఒక యువకుడు డేటింగ్ యాప్‌లో ఒక అమ్మాయితో పరిచయం చేసుకుని చాట్ చేయడం ప్రారంభించాడు. చాటింగ్ పీక్స్‌కు చేరుకోగానే, ఆ అమ్మాయి అతన్ని ఓ కేఫ్‌లో కలుద్దామని ఆహ్వానించింది. కాఫీ తాగుతూ మాట్లాడుకుంటే వచ్చే నష్టమేమిటిలే అని ఆ యువకుడు అనుకున్నాడు. కానీ ఈ డేటింగ్ తన జేబుకు వేల రూపాయల చిల్లు పెడుతుందని అతనికి తెలియదు. రెడ్డిట్‌లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ, తాను కేవలం రూ.3,000 మాత్రమే తెచ్చానని అమ్మాయితో చెప్పినా, ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా జాగర్‌మాస్టర్ షాట్‌లు, రెడ్‌బుల్‌తో కలిపి జాగర్‌బాంబ్‌లను ఆర్డర్ చేసిందని వివరించాడు. అయితే ఒక్క జాగర్‌బాంబ్ ధర రూ.1,200 అని తెలిసి ఆశ్చర్యపోయాడు.
షాకింగ్ బిల్లు, తప్పించుకున్న అమ్మాయి: డేట్ ముగిసి బిల్లు రాగానే యువకుడికి చెమటలు పట్టాయి. బిల్లు మొత్తం రూ.11,958. తన డేట్ తరువాత నువ్వు ఎంత కడతావు అని అమ్మాయిని అడిగాడు. ఆమె సమాధానం విని మరింత షాక్ అయ్యాడు: నా దగ్గర రూ.100 మాత్రమే ఉన్నాయి అని చెప్పి, వెంటనే కేఫ్ నుండి పారిపోయింది. నిస్సహాయంగా ఆ యువకుడు బిల్లును రెండుగా విభజించమని కేఫ్ సిబ్బందిని కోరాడు. కానీ కేఫ్ ఓనర్ అతన్ని బెదిరించడం మొదలుపెట్టారు. మీరు బిల్లు చెల్లించకపోతే, మేము పోలీసులను పిలుస్తాము, అప్పుడు మీరు రూ.10,000 జరిమానా కూడా కట్టాలి, అంటే బిల్లు రూ.22,000 అవుతుందని హెచ్చరించారు.
స్నేహితుడితో సమస్య పరిష్కారం: ఆ యువకుడు పట్టు వదలకుండా తన స్నేహితుడిని కేఫ్‌కు పిలిచాడు. ఇద్దరి మధ్య చాలా వాదన జరిగిన తర్వాత, చివరికి రూ.2,500కు సమస్య పరిష్కారమైంది. అయితే ఈ సంఘటన ఆ యువకుడికి మంచి గుణపాఠం నేర్పింది. ఇప్పుడు నేను డేటింగ్ యాప్‌లలో కొత్త వారిని కలిసే ముందు వందసార్లు ఆలోచిస్తాను అని అతను రెడ్డిట్‌లో రాశాడు. ఇది అతని కథ మాత్రమే కాదు, డేటింగ్ యాప్‌ల పేరుతో మోసపోతున్న ఎంతోమంది బాధితుల ఆవేదన.
రెడ్డిట్‌లో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, చాలా మంది యూజర్లు స్పందించారు. ఇది ఒక పక్కా ప్లానుతో కూడిన మోసమని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ అమ్మాయి కేఫ్‌తో కుమ్మక్కైంది. ఇది పాత స్కామ్, ఇందులో అమ్మాయిలు, కేఫ్‌లు కలిసి ప్రజలను దోచుకుంటాయి అని ఒక యూజర్ అన్నారు. చాలా మంది లోకేస్ కేఫ్‌ను ఈ ప్రదేశం ఇలాంటి మోసాలకు ఫెమస్ అని చెప్పారు. ఢిల్లీ, ముంబైలలోని చాల కేఫ్‌లు ఇలాంటి మోసాలను నిర్వహిస్తున్నాయని కూడా కొందరు పేర్కొన్నారు.
ఈ స్కామ్ చేసే పద్ధతి చాలా తెలివైనది. అమ్మాయిలు మొదట డేటింగ్ యాప్‌లలో పురుషులతో మాట్లాడటం ప్రారంభిస్తారు. తర్వాత వారిని ఒక కేఫ్‌కు పిలుస్తారు. ఈ కేఫ్‌లు ఇప్పటికే ఈ మోసంలో భాగం. అక్కడకు చేరుకున్న తర్వాత, అమ్మాయి మెనూ చూపించకుండా లేదా ధర చెప్పకుండా ఖరీదైన డ్రింక్స్, హుక్కా లేదా ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. బాధితుడికి ఎం అర్థం కాదు, బిల్లు వచ్చినప్పుడు వేలల్లో ఉంటుంది. బాధితుడు బిల్లు చెల్లించడానికి నిరాకరిస్తే, కేఫ్ సిబ్బంది, అమ్మాయి కలిసి బెదిరిస్తారు. కొన్నిసార్లు పోలీసుల బెదిరింపు, మరికొన్నిసార్లు జరిమానా భయం పెడతారు.
ఇలాంటి మోసాలను ఎలా నివారించాలి: డేటింగ్ యాప్‌లు ఫ్రెండ్షిప్, స్నేహ సంబంధాలకు వేదికగా మారాయి, కానీ వాటిని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం:
తెలిసిన ప్రదేశానికి వెళ్ళండి: ఎల్లప్పుడూ ప్రజాదరణ పొందిన, మంచి రివ్యూస్ ఉన్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోండి.
మెనూ చెక్ చేయండి: ఏదైనా ఆర్డర్ చేసే ముందు మెనూ, ధరలను చెక్ చేయండి.
బిల్లుపై నిఘా ఉంచండి: మీ డేట్ ఏదైనా ఆర్డర్ చేస్తుంటే, దానిపై శ్రద్ధ వహించండి. ఎప్పటికప్పుడు బిల్లును చెక్ చేయండి.
డౌట్ ఉంటే జాగ్రత్తగా ఉండండి: మీ భాగస్వామి పదే పదే ఖరీదైన ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే లేదా బిల్లు త్వరగా రావాలని తొందరపెడితే, వెంటనే జాగ్రత్తగా ఉండండి.
డబ్బును పరిమితంగా ఉంచండి: మీ జేబులో తక్కువ డబ్బు ఉంచుకోండి, మీ కార్డును లిమిట్ చేయండి, ఇలాగ మీరు ఎక్కువ ఖర్చు చేయరు.
పోలీసుల సహాయం తీసుకోండి: మీరు ఇలాంటి మోసాలలో చిక్కుకుంటే వెంటనే పోలీసులను సంప్రదించండి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సైబర్ క్రైమ్ సెల్ ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తుంది. మీకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications