దిల్లీ హైకోర్టులో స్పైస్‌జెట్‌కు ఎదురుదెబ్బ.. కళానిధి మారన్‌కు అనుకూలంగా..!
SpiceJet: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మాజీ యజమాని, సన్ గ్రూప్‌కు చెందిన కళానిధి మారన్‌కు.. రూ.380 కోట్లు చెల్లించాలని దిల్లీ హైకోర్టు బడ్జెట్ ఎయిర్‌లైన్ ను ఆదేశించింది.
కోర్టు వెలువరించిన తీర్పు అజయ్ సింగ్ నేతృత్వంలోని స్పైస్‌జెట్‌కు పెద్ద ఎదురుదెబ్బని చెప్పాలి. దీంతో పాటు స్పైస్ జెట్ ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అద్దెదారులతో స్పైస్ జెట్ సమస్యలు కొనసాగుతున్నప్పటికీ డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం నాలుగు రెట్లు పెరిగి రూ.106.8 కోట్లకు చేరుకుంది.

స్పైస్‌జెట్ ప్రస్తుత ప్రమోటర్ అజయ్ సింగ్‌కు, కళానిధి మారన్ కుటుంబానికి మధ్య జరుగుతున్న సుదీర్ఘ కేసులో దిల్లీ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. కళానిధి మారన్, అతని సంస్థ KAL ఎయిర్‌వేస్‌కు కాంట్రాక్ట్‌గా బకాయిపడిన కన్వర్టిబుల్ వారెంట్‌లు, ప్రాధాన్యత షేర్‌లను జారీ చేయడంలో స్పైస్‌జెట్ వైఫల్యం కారణంగా నష్టపోయినట్లు ఆరోపిస్తూ కళానిధి మారన్ 2017లో స్పైస్‌జెట్‌పై దావా వేశారు.
అయితే దావా తర్వాత విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కళానిధి మారన్, KAL ఎయిర్‌వేస్‌కు చెల్లించాల్సిన రూ.579.08 కోట్ల అసలు మొత్తాన్ని చెల్లించింది. అయితే ఈ క్రమంలో చెల్లించాల్సిన వడ్డీ అలాగే మిగిలిపోయింది. అక్టోబర్ 2020 నాటికి వడ్డీ బకాయి మెుత్తం రూ.242 కోట్లకు చేరుకుంది. అది కాస్త 2023 ఫిబ్రవరిలో రూ.362 కోట్లకు పెరిగింది. అయితే ఈ మెుత్తాన్ని వెంటనే చెల్లించాల్సిందిగా దిల్లీ హైకోర్టు తాజాగా ఆదేశించింది.


Click it and Unblock the Notifications