Google News: ఢిల్లీ హైకోర్టులో గూగుల్‌కు ఊరట.. రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కొట్టివేత
Google News: గూగుల్ అందిస్తున్న సేవల్లో వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే ఓ విభాగం పేమెంట్ సర్వీసెస్. 'గూగుల్ పే' ద్వారా ఇండియాలో UPI ఉపయోగించి చెల్లింపులు జరిపేందుకు యూజర్స్ ను ఈ యాప్ అనుమతిస్తోంది. అయితే గూగుల్ పే పై ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
గోప్యతా నిబంధనలను గూగుల్ పే ఉల్లంఘిస్తోందంటూ ఢిల్లీ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(PIL) దాఖలయ్యాయి. అయితే వీటిని న్యాయస్థానం తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో టెక్ దిగ్గజానికి ఉపశమనం లభించినట్లయింది.

పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ గా గూగుల్ పే అనధికార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి తన పిటిషన్ లో ఆరోపించారు. PSS సహా ఇతర చట్టపరమైన నిబంధనల ప్రకారం అధికారం పొందిన ఎంటిటీల జాబితాలో గూగుల్ పే లేదని వాదించారు. తద్వారా ఈ సేవలు అందించేందుకు అవసరమైన పూర్తిస్థాయి పర్మిషన్ కూడా లేదన్నారు.
అయితే ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొట్టివేశారు. గూగుల్ పే అనేది కేవలం థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమేనని పేర్కొన్నారు.
అందువల్ల దీనికి చెల్లింపులు, సెటిల్ మెంట్ సిస్టమ్స్ చట్టం ప్రకారం RBI నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదన్నారు. కాబట్టి ఈ పిటిషన్ పరిగణలోనికి తీసుకోలేమని తేల్చిచెప్పారు.
భాగస్వామ్య బ్యాంకులకు పెద్దమొత్తంలో కస్టమర్ బేస్ ను అందించేందుకు గూగల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ రూపొందించబడినట్లు ధర్మాసనం తెలిపింది. ఈ తరహా యాప్స్ UPI ప్లాట్ ఫారమ్ లో పనిచేయడానికి NPCI నుంచి ఆమోదం పొందుతుంది అని తీర్పులో పేర్కొంది.


Click it and Unblock the Notifications