క్లిక్ చేసాడు పోగొట్టుకున్నాడు.. కస్టమరుకి బ్యాంక్ నష్టపరిహారం చెల్లించాల్సిందే.. ఢిల్లీ హైకోర్ట్ తీర్పు..
సైబర్ క్రైమ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో పుట్టుకొస్తూనే ఉంది. దీని బారిన పడిన వాళ్ళు చాల మంది ఉన్నారు. sms, emails ఇలా ఏదో ఒక విధంగా సైబర్ నేరగాళ్లు దోచుకుంటూనే ఉన్నారు. దీనిపై ఎన్ని అవేర్నెస్ కాంపైన్స్ చేసిన సైబర్ దాడులు ఆగడం లేదు. తాజగా మరో సైబర్ ఫ్రాడ్ వెలుగు చూసింది. ఏంటంటే ఫిషింగ్ దాడిలో రూ. 2.6 లక్షలు కోల్పోయిన హరే రామ్ సింగ్ అనే కస్టమర్‌కు నష్ట పరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆదేశించింది. హరే రామ్ సింగ్ ఫిర్యాదును పరిష్కరించడంలో SBI నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అలాగే ఫ్రాడ్ ట్రాన్సక్షన్ నిరోధించడంలో ఫెలైందని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
సైబర్ అటాక్‌కు గురైన హరే రామ్ సింగ్ మొదట SBI కస్టమర్ కేర్ & బ్రాంచ్ మేనేజర్‌కి సమాచారం అందించాడు. అయితే సకాలంలో సహాయం అందించడంలో బ్యాంకు విఫలమైంది. కొన్ని నెలల తర్వాత SBI హరే రామ్ సింగ్ కంప్లైంట్ తిరస్కరించింది. ఇందుకు OTPల షేరింగ్, ఆన్ అఫీషియల్ ట్రాన్సక్షన్ అని తెలిసినప్పటికీ హానికరమైన లింక్‌పై క్లిక్ చేయడం వల్లనే అని కారణాలుగా పేర్కొంది.

అయితే ఎస్‌బీఐ ధోరణితో హైకోర్టు సమ్మతించలేదు. జస్టిస్ ధర్మేష్ శర్మ కస్టమర్ ఫిర్యాదుపై బ్యాంక్ గ్లేరింగ్ సర్వీస్ లోపాన్ని ఎత్తిచూపారు. ఆన్ అఫీషియల్ ట్రాన్సక్షన్ అడ్డుకోవడంలో ఎస్‌బీఐ వేగంగా వ్యవహరించడంలో విఫలమవడం బాధ్యతను ఉల్లంఘించినట్లేనని కోర్టు చెప్పింది.అలాగే ఇలాంటి విత్ డ్రాలను నిరోధించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో బ్యాంక్ వైఫల్యం కారణంగానే పిటిషనర్ డబ్బు పోగొట్టుకున్నడని భావించాలి అని కోర్టు పేర్కొంది.
డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఎస్‌బిఐ పాటించకపోవడాన్ని కూడా కోర్టు హైలైట్ చేసింది. ఇంకా ఈ నష్టానికి SBI పూర్తి బాధ్యత వహిస్తుందని తీర్పు చెప్పింది. హరే రామ్ సింగ్ కోల్పోయిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, ముందస్తుగా రూ.25వేల పరిహారం చెల్లించాలని కోర్టు SBIని ఆదేశించింది.


Click it and Unblock the Notifications