bike taxi: పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. సొంతగా ద్విచక్రవాహనం కొనుక్కోలేని వారికి ఆర్టీసీ బస్సులే గతి. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలంటే పెద్ద మొత్తంలో జేబుకు చిల్లు పెట్టుకోక తప్పదు. ఈ సమయంలో సరసమైన ధరల్లో, వేగంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు.. ఓలా, ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేశాయి. వీటి సేవలపై ఢిల్లీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నిబంధనల ఉల్లంఘనే:
ఓలా, ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. ప్రైవేట్ రిజిస్ట్రేషన్ తో కూడిన వాహనాలను రైడ్ షేరింగ్ కింద అద్దెకు వినియోగిస్తుండటాన్ని తప్పుపడుతూ, రవాణా శాఖ సోమవారం నోటీసులు జారీచేసింది. వీటిని వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించడం, 1988 మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించడమేనని అందులో పేర్కొంది.

భారీ జరిమానాలు తప్పవు:
మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘిస్తే.. మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించవచ్చని ఆ రాష్ట్ర రవాణా శాఖ పబ్లిక్ నోటీసులో తెలిపింది. ఏడాది జైలు శిక్షతో పాటు మూడు నెలలపాటు డ్రైవర్ లైసెన్స్ సైతం కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని యాప్ ఆధారిత కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘిస్తూ తమను తాము అగ్రిగేటర్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అలా చేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.

చట్టం ఏమి చెబుతోంది ?
ప్రైవేటు వాహనాలను కేవలం సొంత అవసరాలకు మాత్రమే వినియోగించాలని మోటారు వాహన చట్టం చెబుతోంది. ఈ వెహికల్స్ సాధారణంగా తెలుపు రంగు నంబర్ ప్లేటుతో ఉంటాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఆటోలు, కార్లు, డీసీఎంలు, టాటా ఏస్ లాంటి రవాణా వాహనాల నంబర్ ప్లేట్లు పసుపు రంగులో దర్శనమిస్తుంటాయి. తెలుపు రంగు ప్లేటుతో ఉన్న ద్విచక్రవాహనాలను.. నిబంధనలకు విరుద్దంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీ సంస్థల్లో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటం ఇప్పుడు వివాదానికి కారణమైంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications