ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఓ బాలీవుడ్ సినిమాపై ఢిల్లీ కోర్టు స్టే విధించింది. ఆమె లైఫ్ హిస్టరీ ఆధారంగా Chanda: A Signature That Ruined A Career అనే సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల కాకుండా నిలిపివేయాలని చందా కొచ్చార్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఈ మేరకు ఆమె తన లాయర్ విజయ్ అగర్వాల్, నమన్ జోషిల ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కోర్టు కేసు నడుస్తున్న సమయంలో తనను అపరాధిగా చూపించే విధంగా సినిమాను నిర్మిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన ఢిల్లీ కోర్టు ఈ సినిమాపై స్టే విధించింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయకూడదని ఆదేశించింది. అలాగే, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చందాకొచ్చార్ పేరును ఉపయోగించవద్దని స్పష్టం చేసింది.
సినిమా విడుదలకు నో...
న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జి సందీప్ గార్గ్ శనివారం ఈ సినిమాపై స్టే విధించారు. నిర్మాతలు, అసోసియేట్ ఏజెంట్స్, ఇతర నటీ నటులు.. ఇలా ఎవరు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎక్కడా చందాకొచ్చార్ పేరును ఉపయోగించరాదని ఆదేశించారు. సినిమాను కూడా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్‌లో విడుదల చేయవద్దని పేర్కొన్నారు.
ఒక్క సంతకంతో కేరీర్ నాశనం...
ఈ సినిమా కోసం నిర్మాతలు.. చందాకొచ్చార్‌ను ఎప్పుడూ సంప్రదించలేదని ఆమె తరఫు లాయర్ విజయ్ అగర్వాల్ అన్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఒక్క సంతకంతో చందాకొచ్చార్ కెరీర్‌ను ఎలా నాశనం చేసుకున్నారో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పారని తెలిపారు. ఈ సినిమా కోసం తాను చందాకొచ్చార్ ఆహార్యాన్ని అనుసరించినట్లు కూడా సదరు నటి చెప్పారన్నారు.

అంతా చందా కొచ్చార్ లాగే..
వాకింగ్ స్టైల్, మాట్లాడటం, బాడీ లాంగ్వేజ్... ఇలా అన్నింటా చందాకొచ్చార్‌ను అనుకరించినట్లు సదరు నటి ఇంటర్వ్యూలో చెప్పినట్లు తన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. చిత్రం టైటిల్ పైన కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగా అపరాధిగా చూపించడాన్ని ఆమె తప్పుబట్టారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications