Credit Card: దాదాపు ఆర్థిక కార్యకలాపాలు అన్నింటికీ బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ అవి వినియోగదారులపై ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు వసూలు చేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కొందరు కోర్టు మెట్లెక్కితేనే కానీ అసలు అటువంటి నిబంధనలు ఉన్నాయి అని సామాన్య ప్రజలకు తెలియడం లేదు. కొన్ని సందర్భాల్లో అయితే ఆయా బ్యాంకులపై కోర్టులు, RBI చర్యలు తీసుకోవడం చూస్తున్నాం.
SBI కార్డ్స్ & పేమెంట్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఢిల్లీ వినియోగదారుల ఫోరమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కార్డ్ గడువు ముగిసిన తర్వాత కూడా బిల్లు పంపినందుకు మరియు ఛార్జీలు చెల్లించని కారణంగా బ్లాక్ లిస్ట్‌లో ఉంచినందుకు ఓ వ్యక్తి ఆ సంస్థపై ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపిన ఫోరమ్ సదరు బాధితుడికి 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

క్రెడిట్ కార్డు గడువు ముగియడానికి చాలా ముందుగానే ఏప్రిల్ 2016లో తన కార్డును రద్దు చేయాలని, దానిని పునరుద్ధరించవద్దని మాజీ పాత్రికేయులు MJ ఆంథోనీ SBIని అభ్యర్థించారు. ఏప్రిల్ 9, 2016 తర్వాత ఎలాంటి లావాదేవీలకు కార్డును ఉపయోగించలేదు. నిబంధనల ప్రకారం కార్డును ధ్వంసం చేశారు. తన కార్డు రద్దు గురించి కంపెనీ నుంచి సెప్టెంబరులో ఒక లేఖను సైతం అందుకున్నారు. అయితే తన నిరసన ఇ-మెయిల్స్ పట్టించుకోకుండా కంపెనీ బిల్లులను పంపిస్తూనే ఉంది.
"మే 18, 2017 నాటికి లేట్ పేమెంట్ ఛార్జీలు, పెనాల్టీతో కలిపి 2 వేల 946 బిల్లు చెల్లించాలని స్టేట్ మెంట్ మెయిల్ వచ్చింది. బిల్లు చెల్లించాలని కంపెనీ అందులో హెచ్చరించింది. లేకుంటే క్రెడిట్ బ్యూరో నిర్వహించే రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు భవిష్యత్తులో క్రెడిట్ అవసరాలకు ఆటంకం కలిగించవచ్చు" అని SBI కార్డ్స్ పేర్కొన్నట్లు ఆంథోని పేర్కొన్నారు.
RBI నిర్వహిస్తున్న ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల యొక్క CIBIL వ్యవస్థలో కంపెనీ తనను బ్లాక్ లిస్ట్ చేసినట్లు ఆంథోనీ తెలిపారు. రుణాలు, క్రెడిట్ కార్డ్స్ పొందడంలో ఇబ్బంది పడాల్సి వచ్చిందని వెల్లడించారు. లోపభూయిష్టమైన సేవలు అందించినందుకు గాను 2 నెలల్లో 2 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ తీర్పు నిచ్చింది. అది విఫలమైతే పరిహారం 3 లక్షలు అవుతుందని పేర్కొంది. అయితే ఆంథోనీ ఆరోపణలను కంపెనీ ఖండించింది.


Click it and Unblock the Notifications