కస్టమర్లకు Punjab National Bank హెచ్చరిక.. తెలుసుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త..!
PNB News: డిజిటల్ యుగంలో మాయగాళ్ల లీలలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ప్రధానంగా బ్యాంక్ ఖాతాదారులను టార్గెట్ చేస్తున్నారు. ఏమరపాటుగా ఉన్న కస్టమర్ల అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ఏప్రిల్ 22, 2023న కస్టమర్లను అలర్ట్ చేసింది. బ్యాంక్ పేరుతో చెలామణి అవుతున్న నకిలీ(Fake) మెసేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రధానంగా సోషల్ మీడియా, వాట్సాప్ వంటి ఇతర ఛానెల్‌ల ద్వారా సర్క్యులేట్ అయ్యే ఫేక్ మెసేజ్‌లతో మోసాలు జరుగుతున్నాయని తన ప్రకటనలో తెలిపింది.

వివరాల్లోకి వెళితే ఇటీవలి కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 130వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక రాయితీలను అందిస్తోందంటూ ఫేక్ మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వీటితో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ పేరుతో సర్కులేషన్లో ఉన్న వార్త పూర్తిగా అసత్యమని.. దీనికి సంబంధించి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా వాటికి స్పందించవద్దని స్పష్టం చేసింది.
ముందుజాగ్రత్త చర్యగా ఫోన్ కాల్స్, ఈ-మెయిల్‌ల ద్వారా ఏదైనా రహస్య/వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దని బ్యాంక్ తన కస్టమర్లను హెచ్చరించింది. అలాగే ఏవైనా అనుమానాస్పద లింక్‌లు చట్టబద్ధమైనవిగా కనిపించినప్పటికీ వాటిని క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేయవద్దని కస్టమర్‌లను కోరింది. బ్యాంకింగ్ వ్యవస్థలో పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నందున బ్యాంకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కస్టమర్లను అప్రమత్తం చేయటం అవసరమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


Click it and Unblock the Notifications