Defence Shares: ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లతో పాటు మ్యూచువల్ ఫండ్లలో సైతం డిఫెన్స్ రంగానికి చెందిన షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భారత ప్రభుత్వం దేశీయ సంస్థలను ప్రోత్సహించటంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కంపెనీలు ఎదగటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు చేపట్టారు.
అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. నేడు ఇంట్రాడేలో డిఫెన్స్ కేటగిరీలోని కంపెనీల షేర్లు బేర్స్ చేతిలో చిక్కి క్షీణతను చూశాయి. ఈ క్రమంలో మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ షేర్లు ఈరోజు 9 శాతానికి పైగా పడిపోయాయి. మంగళవారం ఉదయం కొచ్చిన్ షిప్‌యార్డ్స్, గార్డెన్ రీచ్ షేర్లు సైతం పతనాన్ని చూశాయి. మంచి ఆర్డర్ బుక్‌తో పాటు జూన్ త్రైమాసిక ఫలితాలు బలంగా వచ్చినప్పటికి డిఫెన్స్ స్టాక్ మజాగాన్ డాక్ పతనాన్ని చూశాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లకు Sell రేటింగ్ అందించింది. కంపెనీ ప్రస్తుత వాల్యుయేషన్ కారణంగా నిర్మల్ బ్యాంగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సైతం మజాగాన్ డాక్ షేర్లకు సెల్ రేటింగ్ అందించింది.

ఈ క్రమంలో డిఫెన్స్ కేటగిరీకి చెందిన మరో స్టాక్ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కూడా భారీ క్షీణతను చూసింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.2,153.95 స్థాయిలో ప్రారంభమై తర్వాత నష్టాల నుంచి రికవర్ అయ్యాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి కొచ్చిన్ షిప్‌యార్డ్ షేర్లు 5.73 శాతం క్షీణించి రూ.2,039.50 స్థాయికి చేరుకోవటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అలాగే నేడు గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ షేర్లు పేలవ పనితీరును కనబరిచాయి. బీఎస్ఈలో డిఫెన్స్ స్టాక్ రూ.1,900.95 స్థాయిలో క్షీణతతో ప్రారంభమై తర్వాత 9.67 శాతం పతనాన్ని చూశాయి. దీంతో స్టాక్ ధర రూ.1,751.60 స్థాయికి దిగజారాయి.
ఇక చివరిగా ఇన్వెస్టర్లను నిరాశపరిచిన డిఫెన్స్ కేటగిరీ కంపెనీల్లో నేడు పారాస్ డిఫెన్స్ కూడా నిలిచింది. గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. కానీ నేడు కంపెనీ షేర్లలో క్షీణత నెలకొంది. కంపెనీ ఇంట్రాడే గరిష్ట స్థాయి ధర రూ.1,323.95 నుంచి 7 శాతానికి పైగా పడిపోటంపై ఇన్వెస్టర్లు నిరాశగా ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications