రాకెట్ల పెరుతున్న డిఫెన్స్ స్టాక్స్.. కేంద్ర తీసుకున్న నిర్ణయంతో.. ఐసీఐసీఐ టార్గెట్ ధరలు ఫిక్స్..

ఈ వారం మొదటి రోజు నుండి స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుంది. మరోపక్క అదానీ పై కోర్ట్ కేసు దెబ్బకు డీలా పడిపోతాయన్న షేర్లు కూడా పుంజుకున్నాయి. ఒక విధంగా చూస్తే స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు కూడా ఇన్వెస్టర్లలో ఆశలు రేపాయి. తాజాగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) రూ. 21,772 కోట్ల విలువైన ఐదు కొనుగోలు ప్రతిపాదనలను ఆమోదించింది. దీంతో డిఫెన్స్ స్టాక్స్ 5% వరకు ఎగిశాయి. డిసెంబరు 4న ట్రేడింగ్‌ ప్రారంభంలో డిఫెన్స్ కంపెనీల షేర్లు 5 శాతం వరకు పెరిగాయి. డిఫెన్స్ కంపెనీల్లో మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వంటి షేర్లు ఊపందుకున్నాయి. ఇవి దాదాపు 5 శాతం లాభపడగా, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ వంటి షేర్లు 2 నుంచి 3 శాతం లాభపడ్డాయి. ఈ కొనిగోళ్ళ ప్రతిపాదనల ఆమోదంతో ఈ డిఫెన్స్ కంపెనీల ఆర్డర్ బుక్ పెరుగుతుందని భావిస్తున్నారు.

ఒక ఇంగ్లీష్ వార్త ప్రకారం, వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ (WJFAC), ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, రాడార్ వార్నింగ్ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌తో సహా అవసరమైన ప్రతిపాదనల(AoN)కు DAC ఆమోదం ఇచ్చింది.

defence stocks are flying high today DAC approved acquisation proposal of rs 21772 crores

సముద్ర తీరానికి సమీపంలో తక్కువ తీవ్రత ఉన్న ఆపరేషన్స్, నిఘా, పాట్రోల్ ఇంకా సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) మిషన్‌లను మెరుగుపరచడానికి నేవి 31 కొత్త WJFACలను కొనుగోలు చేస్తుంది. అంతకుముందు గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్లు భారత ఇండియన్ నేవికి WJFACని సప్లయ్ చేసింది. దీంతో మరో ఆర్డర్‌ పొందాలన్న కంపెనీ ఆశలు మరింత పెరిగాయి.

ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, డిస్ట్రాయర్లు, సబ్ మెరైన్స్ వంటి ఎక్కువ వాల్యూ ఉన్న యూనిట్లను ఎస్కార్ట్ చేయడానికి, T-72 & T-90 ట్యాంకులు, సుఖోయ్ యుద్ధ విమానాల ఇంజిన్‌లను సరిచేయడానికి రూపొందించిన 120 ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్ (FIC-1) కొనుగోలుకు కూడా ఇలాంటి అనుమతులు ఇచ్చారు.

త్వరలో SU-30 MKI ఆపరేషనల్ క్యాపబిలిటీస్ మెరుగుపరచడానికి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ (EWS) కొనుగోలు కూడా ప్రారంభింవచ్చు. డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం EWSను అభివృద్ధి చేసింది.

ఈ షేర్ల టార్గెట్ ధర
ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌లో డిఫెన్స్ అనలిస్ట్ అమిత్ దీక్షిత్ మాట్లాడుతూ, ఈ ఆమోదం కొంత కాలం పాటు ఉన్న మందగమనం తర్వాత దేశీయ ఆర్డరింగ్‌లో సానుకూల మలుపును చూపిస్తుందని అన్నారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ భారత్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రా మైక్రోవేవ్ రెండింటిపై రూ. 350 అలాగే రూ. 935 టార్గెట్ ధరలతో అడ్వైజ్ చేసింది. డిఫెన్స్ పిఎస్‌యులలో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బిఇఎల్‌ సిఫార్సు చేయగా దీని టార్గెట్ ధరను రూ.350గా సూచించింది. ఇవాళ బిఇఎల్ షేర్లు 0.24 శాతం పెరిగి రూ.312.75 వద్ద ట్రేడవుతున్నాయి.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+