Defence Stock: చాలా కాలంగా ఇన్వెస్టర్లు మార్కెట్లలో మల్టీబ్యాగర్ స్టాక్స్ వేటలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు రైల్వేలు, ఇన్ ఫ్రా, డిఫెన్స్, అగ్రి వంటి కీలక రంగాల్లో అటువంటి షేర్ల కోసం తమ అన్వేషనను కొనసాగిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్లలో దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నంది సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. గడచిన కొన్నేళ్లుగా డిఫెన్స్ రంగంపై భారత ప్రభుత్వ దృష్టి పెరగటంతో ఈ స్టాక్ అందరి పోర్ట్ ఫోలియోలో స్థానాన్ని సంపాదించుకునే పనిలో ఉంది. మల్టీబ్యాగర్ స్టాక్ తన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించటంతో నిపుణులు సైతం అద్భుత పనితీరుపై బుల్లిష్‌గా ఉన్నారు. ఈ క్రమంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం రూ.300.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాది కిందట ఇదే కాలంలో కంపెనీ లాభం కేవలం రూ.201.59 కోట్లుగా ఉంది.

సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభం వార్షిక ప్రాతిపదికన 49.08 శాతం పెరగటం ఇన్వెస్టర్లను ప్రస్తుతం ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ఆదాయం తొలి త్రైమాసికంలో రూ.1,694.78 కోట్లుగా నివేదించింది. ఇబిటాలో 43 శాతం వృద్ధి నమోదు కావడం కంపెనీకి మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇది జూన్ త్రైమాసికంలో రూ.473.67 కోట్లుగా ఉంది. గత ఏడాది జూన్ త్రైమాసికంలో ఇబిటా రూ.331.31 కోట్లుగా ఉంది.
బ్రోకరేజ్ టార్గెట్ ధర..
దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సోలార్ ఇండస్ట్రీస్ టార్గెట్ ధరను రూ.13,250గా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం కంపెనీ షేర్ ధర రూ.10,344.50 కంటే దాదాపు 28 శాతం అధికం కావటం గమనార్హం. అలాగే స్టాక్ ధర గడచిన 6 నెలల్లో ఏకంగా 50 శాతం పెరిగాయి. కంపెనీ షేర్లను ఏడాది కాలం నుంచి హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులు ఏకంగా 151 శాతం మల్టీబ్యాగర్ రాబడులను అందుకున్నారు. అయితే గడచిన నెలలో భారీ పెరుగుదల తర్వాత స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ బారిన పడింది. దీంతో అప్పటి నుంచి స్టాక్ దాదాపు 16 శాతం క్షీణతను చూసింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications