defence news: భారత రక్షణ రంగం అవసరాలు, ఆయుధాల కోసం గతంలో విదేశాలపై విపరీతంగా ఆధారపడే వాళ్లం. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ విభాగంలో స్వయం సమృద్ధి దిశగా మోడీ నేతృత్వంలోని కేంద్రం అడుగులు వేసింది. తద్వారా ఆయా ఉత్పత్తులను దేశీయంగా తయారు చేస్తూ, ప్రభుత్వ రంగం సంస్థలు దూసుకుపోతున్నాయి.
3 వేల కోట్లతో 2 ఒప్పందాలు:
వైమానిక దళం(IAF) సామర్థ్యాన్ని పెంపొందించే రాడార్లు, రిసీవర్ల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) తో రక్షణ మంత్రిత్వ శాఖకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు 3 వేల 7 వందల కోట్ల విలువైన రెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మీడియం పవర్ రాడార్లు 'ఆరుద్ర' సరఫరా కోసం 2 వేల 8 వందల కోట్లు, 129 DR-118 రాడార్ వార్నింగ్ రిసీవర్ల కోసం 950 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

స్వదేశంలోనే రూపకల్పన, తయారీ:
రెండు ప్రాజెక్టులూ 'Buy Indian-IDMM' కింద స్వదేశంలో రూపకల్పన చేసి అభివృద్ధి చేయబడినవి కావడం విశేషం. వైమానిక దళానికి సంబంధించిన నిఘా, గుర్తింపు, ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో వీటిని డిజైన్ చేశారు. MPR (ఆరుద్ర) రాడార్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించగా.. BEL తయారు చేస్తోంది. వీటిపై IAF ఇప్పటికే విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించింది.
భారత పరిశ్రమలకు ప్రోత్సాహం:
ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో రక్షణ రంగ తయారీలో స్వావలంబన దిశగా దేశం ప్రయాణించడానికి ఇవి సహాయపడతాయని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. MSMEలు సహా ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మరియు అనుబంధ పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఈ ప్రాజెక్టులు ప్రోత్సహిస్తాయని పేర్కొంది. వీటి ద్వారా మూడున్నరేళ్ల కాలంలో దాదాపు 2 లక్షల పనిదినాల ఉపాధిని కల్పించవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications