Multibagger Stock: ఒకపక్క దేశీయ స్టాక్ మార్కెట్లలోకి కొత్తగా అనేక కంపెనీలు తమ ఐపీవోలను తీసుకొస్తున్నాయి. బుల్ జోరు కొనసాగుతుండటంతో మంచి లిస్టింగ్స్ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మల్టీబ్యాగర్ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచేస్తున్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. గడచిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 1038 శాతం రిటర్న్ అందించింది. ఈ డిఫెన్స్ స్టాక్ ధర జూలై 13,2020న రూ.51.7 వద్ద ఉంది. తాజాగా జూలై 13, 2023న కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో రూ.588.85 వద్ద ముగిసింది.

కంపెనీ షేర్లలో పెట్టుబడులను మూడేళ్ల క్రితం చేసిన వారికి జెన్ టెక్నాలజీస్ స్టాక్ ఊహించని రాబడులను అందించింది. షేర్ ధర మూడేళ్ల కిందట 52 వద్ద ఉన్న సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే వారి పెట్టుబడి విలువ పదిరెట్లు పెరిగి రూ.11.38 లక్షలకు చేరుకుని ఉండేది. గత మూడేళ్లలో ఈ స్టాక్‌తో పోలిస్తే సెన్సెక్స్ 79.82 శాతం మాత్రమే రాబడిని అందించింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయిని గమనిస్తే.. రూ.654.90 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ.167.05గా ఉంది.
మే 24 నాటికి కంపెనీలో 12 ప్రమోటర్లు 57.45 శాతం వాటాను కలిగి ఉన్నారు. కంపెనీ ఇటీవల ప్రభుత్వం నుంచి రూ.160 కోట్ల విలువైన ఆర్డర్ పొందినట్లు జూలై 6న వెల్లడించింది. మార్చి 2023 త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌లోన్ లాభం రూ.17.27 కోట్లుగా నివేదించింది. ఇదే సమయంలో విక్రయాలు రూ.74.14 కోట్లకు పెరిగాయి. జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సెన్సార్ అండ్ సిమ్యులేటర్ టెక్నాలజీ ఆధారంగా డిఫెన్స్ ట్రైనింగ్ సిస్టమ్‌లను డిజైన్, అభివృద్ధి చేస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications