ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం 'ఎటర్నల్ లిమిటెడ్' (Eternal Ltd) లో భారీ మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు.. సీఈఓ దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫిబ్రవరి 1, 2026 నుండి ఈ రాజీనామా అమలులోకి రానుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం బ్లింకిట్ (Blinkit) సీఈఓగా (CEO) ఉన్న అల్బిందర్ ధీండాను కొత్త సీఈఓగా నియమిస్తున్నట్లు కంపెనీ బోర్డు వెల్లడించింది.

షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో ఏముంది?
తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ దీపిందర్ గోయల్ షేర్ హోల్డర్లకు ఒక భావోద్వేగ లేఖ రాశారు. "ఇటీవల నేను కొన్ని కొత్త ఆలోచనల పట్ల ఆకర్షితుడయ్యాను. అవి అత్యధిక రిస్క్, ప్రయోగాలతో కూడుకున్నవి. ఎటర్నల్ వంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉండి వాటిని కొనసాగించడం సరైనది కాదు. ఆ ఐడియాలు కంపెనీ వ్యూహాలకు లోబడి ఉంటే ఇక్కడే చేసేవాడిని. కానీ, అవి వేరు. ఎటర్నల్ గ్రూప్ ఎప్పుడూ క్రమశిక్షణతో, తన వ్యాపార పరిధిలోనే వృద్ధి చెందాలి. అందుకే నేను బయటకు వెళ్లి నా కొత్త కలలను సాకారం చేసుకోవాలి అనుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
జొమాటో నుంచి ఎటర్నల్ దాకా: ఒక అద్భుత ప్రయాణం
దీపిందర్ గోయల్ ప్రయాణం ఒక సాదాసీదా ఐఐటీ (IIT) గ్రాడ్యుయేట్ నుండి భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగే వరకు ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. 2008లో 'Foodiebay' పేరుతో మొదలైన ప్రయాణం, ఆ తర్వాత 'Zomato'గా మారి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ చేరుకుంది. కేవలం ఫుడ్ డెలివరీకే పరిమితం కాకుండా, గతేడాది బ్లింకిట్ ను కొనుగోలు చేసి క్విక్ కామర్స్ రంగంలోనూ పాగా వేశారు. ఆ తర్వాత తన అన్ని వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ 'ఎటర్నల్' (Eternal) బ్రాండ్‌ను సృష్టించారు.
గోయల్ కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, తన విలక్షణమైన పనిశైలికి కూడా పేరుగాంచారు. ఒకానొక సమయంలో డెలివరీ బాయ్ గా మారి స్వయంగా ఫుడ్ డెలివరీ చేసి గ్రౌండ్ లెవల్ సమస్యలను అర్థం చేసుకున్నారు. ఆయన నాయకత్వంలోనే జొమాటో ఐపీఓ (IPO) కి వెళ్లి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
కొత్త నాయకుడు: అల్బిందర్ ధీండా
దీపిందర్ వారసుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న అల్బిందర్ ధీండాపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లింకిట్ ను అతి తక్కువ కాలంలో లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుని, ఎటర్నల్ గ్రూప్ ను మరింత ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు ధీండా ముందున్న ప్రధాన సవాలు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications