Deepika Padukone: ఇషా అంబానీతో జతకట్టిన దీపికా పదుకొణే.. బ్యూటీ ఇండిస్ట్రీని ఏలేందుకు రెడీ..
Isha Ambani: కొంతమంది నటులు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వివిధ వ్యాపారాల్లోనూ తలమునకలై ఉంటారు. ఇలా విజయవంతంగా బిజినెస్ రన్ చేస్తున్న వారిలో కేవలం నటులే కాకుండా నటీమణులు కూడా ఉన్నారు. వారిలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణే ఒకరు.
దేశంలోని దిగ్గజ వ్యాపారి ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీతో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ఓ బిజినెస్ అగ్రిమెంట్ సంతకం చేశారు. తన D2C స్వీయ-సంరక్షణ బ్రాండ్ 82 E కోసం రిలయన్స్ రిటైల్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ 'టిరా'తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు. 82 E బ్రాండ్ చర్మ, శరీర సంరక్షణ మరియు పురుషుల శ్రేణిలో ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఈ ఒప్పందంతో మొదటిసారి ఆ బ్రాండ్ ఆఫ్‌లైన్ ద్వారా రిటైల్ సేల్స్ జరపనుంది.

ఆగస్టు 2022లో రిలయన్స్ రిటైల్‌ను ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీకి అప్పగించారు. ఆమె నాయకత్వంలో ఆ కంపెనీ ప్రస్తుతం గణనీయమైన వృద్ధిని మరియు విస్తరణను సాధించింది. 'టిరా' అనేది రిలయన్స్ రిటైల్ ఓమ్నిచానెల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫారమ్. ఏప్రిల్ 2023లో ఇది ప్రారంభించబడింది. ఇప్పుడు దీనితోనే దీపికా బ్రాండ్ 82 E ఒప్పందం కుదుర్చుకుంది.
'టిరా'ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వ్యాపార ఒప్పందం ఎంతగానో సహకరిస్తుందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. వినియోగదారులకు ప్రీమియం చర్మ సంరక్షణను అందించడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు. స్వీయ-సంరక్షణ అనుభవాన్ని మెరుగుపరచడంలో లక్ష్యంగా ఆఫ్‌లైన్ రిటైల్‌కు 82 E ఉత్పత్తులను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications