Paytm Crisis: ఆర్‌బీఐ తీరుపై ఆగ్రహజ్వాలలు.. ద్వంద్వత్వం పనికిరాదంటూ..
Ashneer Grover: ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం విషయంలో రిజర్వు బ్యాంక్ తీరును భారత్ పే వ్యవస్థాపకుడు అషనీర్ గ్రోవర్ ఖండించారు. చిన్న తప్పులకు పెద్ద ఆంక్షలు విధించటంపై ఆర్బీఐ తీరును ఎండగట్టారు.

దేశీయ సెంట్రల్ బ్యాంక్ పేటీఎం కస్టమర్ ఖాతాల టాపప్, వాలెట్స్, ప్రీపెయిడ్ సేవలు, కామన్ మెుబిలిటీ కార్డ్, ఫాట్సాగ్ చేపట్టకుండా నిషేధాన్ని ఫిబ్రవరి 29న ప్రకటించింది. దీనిపై గ్రోవర్ ట్విట్టర్ వేధికగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి, పీఎంవో కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ రిజర్వు బ్యాంక్ తనకు అర్థం కాలేదంటూ కామెంట్ చేశారు. గడచిన దశాబ్ధంగా ఉపాధి కల్పించటంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి స్టార్టప్ కంపెనీలు అతిపెద్ద పాత్రను పోషించాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఐఐటి, ఐఐఎమ్ లలో చదివిన వారికి సైతం ఉద్యోగాలు దొరకటం లేదని గుర్తుచేశారు.

ఇదే విషయంపై క్యాపిటల్‌మైండ్ వ్యవస్థాపకుడు, సీఈవో దీపక్ షెనాయ్ కూడా స్పందించారు. ఆర్‌బీఐ చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ ఇలాగే బ్యాంకును నాశనం చేస్తుందని నమ్మలేకపోతున్నానంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. యెస్ బ్యాంక్ విషయంలో పెద్ద సమస్యలు వచ్చినప్పుడు సైతం ఇతర బ్యాంకింగ్ సంస్థలను భాగస్వాములుగా చేసి రక్షించటానికి సహాయపడిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్టేక్ హోల్డర్లందరినీ ఇబ్బంది పెట్టే చర్యలకు దికటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై తన చర్యకు ఆర్‌బీఐ నిబంధనలు పాటించకపోవడం, బ్యాంక్‌లో కొనసాగుతున్న పర్యవేక్షక ఆందోళనలే కారణమని పేర్కొంది. కానీ వడ్డీ, క్యాష్ బ్యాక్ లేదా రీఫండ్‌లను ఎప్పుడైనా క్రెడిట్ చేయవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అలాగే మార్చి 15, 2024లోపు అన్ని పైప్‌లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాలను సెటిల్ చేయాలని కంపెనీని కోరింది. రిజర్వు బ్యాంక్ పరిమితులు సేవింగ్స్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎన్‌సీఎంసీ ఖాతాలలోని వినియోగదారు డిపాజిట్లపై ప్రభావం ఉండబోదని తెలిపింది.


Click it and Unblock the Notifications