IPO News: లాభాల సుడిగుండంలో ఇన్వెస్టర్లు.. డబ్బులు డబుల్ చేసిన ఐపీవో..
Deepak Chemtex IPO: డిసెంబరులో వస్తున్న ఐపీవోలన్నీ సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఐపీవోల్లో షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సంపద గంటలు, నిమిషాల్లోనే రెండితలుగా మార్చేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకునేది దీపక్ కెమ్ టెక్స్ ఐపీవో గురించే. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఐపీవో షేర్లు అద్భుతమైన లిస్టింగ్ నమోదు చేశాయి. కంపెనీ షేర్లు 90 శాతం ప్రీమియం రేటు రూ.152 వద్ద స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడ్డాయి. లిస్టైన కొద్ది సేపటికే స్టాక్ 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకింది. దీంతో కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.159.60 రేటుకు చేరుకున్నాయి.

షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకటంతో ఇన్వెస్టర్లు 99.50 శాతం రాబడిని తమ పెట్టుబడిపై తొలిరోజే అందుకున్నారు. అలా వారి డబ్బు మెుదటి రోజునే రెండింతలు అయ్యింది. వాస్తవానికి కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.76 నుంచి రూ.80గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే పెట్టుబడిదారుల కొనుగోలు కోసం లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించింది. ఒక లాట్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు కనీసం రూ.1,28,000 పెట్టుబడిగా పెట్టారు.
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు తెరచి ఉన్న ఐపీవోలో ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తిని కనబరిచారు. ఈ క్రమంలో రిటైల్ విభాగంలో 475.36 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఐపీవో రూ.6.54 కోట్లను సమీకరించింది. వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా మెుత్తం రూ.23.04 కోట్లను సమీకరించింది. ఇందుకోసం కొత్తగా 28.8 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఈ ప్రక్రియ తర్వాత ఐపీవోకి ముందు కంపెనీలో99.40 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 73.05 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications