Vijay Kedia Stocks: దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రసిద్ధ పెట్టుబడిదారుల సూచనలతో పాటు వారి పోర్ట్ ఫోలియోను కూడా ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే విజయ్ కేడియాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వాస్తవానికి నేటి కాలంలో పెరుగుతున్న సాంకేతికతను దుండగులు దుర్వినియోగం చేస్తున్నారు. ఒకప్పుడు సినీ రాజకీయ ప్రముఖులను వేధించిన డీప్ ఫేక్ వీడియోలు ప్రస్తుతం ప్రముఖ పెట్టుబడిదారు విజయ్ కేడియాను కూడా వదలటం లేదు. తన పేరుపై ఇన్వెస్టర్లను షేర్లు కొనాలంటూ చేస్తున్న సూచనలకు సంబంధించిన వీడియో తన దృష్టికి రావటంతో కేడియా స్పందించారు. బుధవారం సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక జారీ చేశారు. సదరు వీడియోలో కేడియాను అనుకరిస్తున్న వ్యక్తి డీప్ ఫేక్ వీడియో 3 స్టాక్‌లను సిఫార్సు చేస్తున్నట్లు కనిపించింది.

సదరు వైరల్ వీడియోలో సూచించబడిన స్టాక్స్ కొంటే ఇన్వెస్టర్లు కేవలం నెలలోనే 20 రెట్లు రాబడిని అందుకుంటారని సూచించబడింది. ఈ వీడియోలను నమ్మే ముందు వాటిని ధృవీకరించాలని, వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారుడు విజయ్ కేడియా తన సోషల్ మీడియా ఫాలోవర్లను కోరారు. అచ్చం తనలాగే ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోలో తన యాక్సెంట్ మార్చినట్లు కేడియా పేర్కొన్నారు. నకిలీ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలని కేడియా కోరారు.
Someone made a fake video of me advising shares. The face is mine, the voice is mine… but suddenly, I sound like I studied in Oxford and grew up in New York! If you ever hear me speaking perfect English with a Western accent, just know—it’s not me.Beware of fake videos—verify… https://t.co/Wx1ln8bekL
— Vijay Kedia (@VijayKedia1) February 25, 2025
ఇలాంటి డీప్ ఫేక్ తప్పుడు వీడియోలను నమ్మటానికి ముందు ధృవీకరించుకోకపోతే తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి కష్టపడి సంపాదించిన డబ్బు వెళ్లే ప్రమాదం ఉందని కేడియా అన్నారు. సదరు వీడియోలో మూడు షేర్లను ఇన్వెస్టర్లకు సూచిస్తూ వాటిలో పెట్టుబడికి ప్రస్తుతం సరైన సమయమని, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కేవలం నెలలోనే 20 రెట్ల కంటే ఎక్కువ రాబడి పొందవచ్చని సూచించబడింది. అయితే నిందితులు ఆ స్టాక్స్ వివరాలు తెలుసుకునేందుకు తాము సూచించిన గ్రూప్ లో ఉచితంగా చేరాలని ఫాలోవర్లను అడగటం గమనార్హం.
సైన్స్ ప్రపంచానికి ఒక వరం లాంటిది కానీ కొన్నిసార్లు అది శాపంగా మారుతుందన్న కేడియా నేటి కాలంలో అబద్దాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాస్తవానికి దీనిని ఏఐ వినియోగించి అభివృద్ధి చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications