Multibagger Stock: రూ.లక్షను రూ.13 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. అదీ 11 నెలల్లోనే..
ప్రముఖ వజ్రాల ఆభరణాల కంపెనీ డీప్ డైమండ్ స్టాక్ కేవలం 11 నెలల్లో పెట్టుబడిదారుల సొమ్మును 1288 శాతం పెంచింది. ఇప్పుడు కంపెనీ తమ స్టాక్ లను స్ల్పీట్ చేసింది. శుక్రవారం ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దాదాపు 5 శాతం లాభంతో రూ. 16 అప్పర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను రూ.1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లుగా అంటే 1:10 నిష్పత్తిలో విభజించాలని కంపెనీ నిర్ణయిం తీసుకుంది.
డీప్ డైమండ్ షేర్లు కేవలం 11 నెలల్లో పెట్టుబడిదారులకు 1288 శాతం రాబడిని అందించాయి. గత ఏడాది ఫిబ్రవరి 23, 2022న ఈ స్టాక్ రూ.11 వద్ద ఉండగా, జనవరి 19న రూ.152.65 చేరింది. 11 నెలల్లో పెట్టుబడిదారులు పెట్టుబడి దాదాపు 14 రెట్లు పెరిగింది. గత సంవత్సరం అక్టోబర్ 25, 2022న, ఇది రికార్డు స్థాయిలో రూ. 171.95 వద్దకు చేరింది. ఇది స్టాక్ స్ప్లిట్ తర్వాత రూ. 17.20 స్థాయికి చేరింది.

డీప్ డైమండ్ అనేక రకాలైన 18k డైమండ్ ఆభరణాలను సేల్ చేస్తుంటుంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా అతి తక్కువ ధరకే డైమండ్ జ్యువెలరీని అందజేస్తామని కంపెనీ వివరించింది. దాని ఆభరణాలన్నీ ఇంటర్నేషనల్ జెమాలజీ ఇన్‌స్టిట్యూట్ ( IGI ) గుర్తింపు ఉంది. BSEలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, త్రైమాసిక ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ 2022లో దాని నికర లాభం రూ. 43 లక్షల నుంచి రూ. 61 లక్షలకు పెరిగింది. అయితే ఆదాయం రూ.1.50 కోట్లకు తగ్గింది. ఈ స్టాక్ లో సంవత్సరం క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.13 లక్షలు అయ్యి ఉండేది.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నది. స్టాక్ ల్లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications