Deem Roll Tech IPO: ఫిబ్రవరి నెల దాదాపు ముగింపుకు వచ్చిన సమయంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఒక ఐపీవో అడుగుపెట్టింది. కొత్త వారం వచ్చిన ఐపీవో తొలిరోజే ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు లిస్ట్ అయిన డీమ్ రోల్ టెక్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 55 శాతం ప్రీమియం రేటు వద్ద నేడు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా అయ్యాయి. దీంతో స్టాక్ రూ.200 రేటు వద్ద లిస్ట్ అయ్యి సూపర్ రాబడును మెుదటి రోజే ఇన్వెస్టర్లకు అందించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఫిబ్రవరి 20న తెరచుకున్న ఐపీవో ఫిబ్రవరి 22న ముగిసింది.

వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరుకు తన ఇష్యూ ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధరను రూ.129గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించింది. దీంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1,29,000 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.29.26 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం పెట్టుబడిదారులకు 22.69 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
డీమ్ రోల్ టెక్ కంపెనీ ప్రమోటర్లు జ్యోతి ప్రసాద్ భట్టాచార్య, దేవ్ జ్యోతి ప్రసాద్ భట్టాచార్య. ఐపీవో ఇష్యూకి ముందు ప్రమోటర్లకు కంపెనీలో 92.18 శాతం వాటాను ఉండగా.. అది ఇప్పుడు 67.12 శాతానికి తగ్గింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో మొత్తం లాభం రూ.371.83 కోట్లుగా నమోదైంది.
ఇష్యూ ఓపెన్ అయిఉన్న మూడు రోజుల కాలంలో ఐపీవో 226 సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. చివరి రోజున అంటే ఫిబ్రవరి 22న మొత్తం సబ్‌స్క్రిప్షన్ 256.55 సార్లు అందుకుంది. రిటైల్ కేటగిరీ 180.50 సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది.


Click it and Unblock the Notifications