గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతోంది. తాజాగా క్రూడ్ ఆయిల్ ధర 15 నెలల కనిష్ఠానికి పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 73 డాలర్లుగా ఉంది. డబ్య్లూటీ చమురు ధర బ్యారెల్ కు 67 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధర తగ్గడం లేదు. చమురు దిగుమతి చేసుకునే భారతీయ కంపెనీలు కూడా బ్యారెల్ కూ 74 డాలర్లుగా ఉంది. జనవరిలో బ్యారెల్ 80 డాలర్లుగా ఉంది. అంటే దాదాపు 8.5 శాతం తగ్గింది.

ఉక్రెయిన్, రష్యా
గత సంవత్సరం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. ఒక స్థాయిలో బ్యారెల్ ముడి చమురు ధర 139 డాలర్లకు చేరుకుంది. 2008 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మార్చిలో ముడు చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డిజీల్ ధరలు పెంచారు. అయితే కొద్ది రోజులుగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిలు ధరలు మాత్రం తగ్గడం లేదు.

పెట్రోల్, డీజిల్
పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకపోవడంపై పలువురు ఎంపీలు ప్రభుత్వానికి ప్రశ్నించారు. 2022 ఏప్రిల్ 6న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయించాయని.. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని ప్రభుత్వం గుర్తు చేసింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2022 మధ్య మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ రూ.18,622 కోట్ల నష్టాన్ని చవిచూశాయని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ రాజ్యసభలో ప్రకటించారు.

ప్రభుత్వ కంపెనీలు
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గినా దేశీయంగా తగ్గకపోవడంతో పెట్రోల్, డీజిల్‌ను ప్రభుత్వ చమురు కంపెనీలకు మంచి లాభం వస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. నవంబర్ 2, 2021కి ముందు, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 32.90, డీజిల్‌పై రూ. 31.80 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. అయితే ద్రవ్యోల్బణం పెరగడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications