WPI inflation: డిసెంబర్ హోల్‌సేల్ ద్రవ్యోల్భణం 13.56 శాతం

హోల్ సేల్ ద్రవ్యోల్భణం డిసెంబర్ నెలలో తగ్గింది. 2021 నవంబర్ నెలలో 14.2 శాతంతో భారీ గరిష్టానికి చేరుకున్న అనంతరం డిసెంబర్ నెలలో మాత్రం తగ్గింది. ఏడాది ప్రాతిపదికన డిసెంబర్ నెలలో 13.56 శాతంగా నమోదయింది. ఈ మేరకు శుక్రవారం నివేదిక విడుదలయింది. డిసెంబర్ 2020లో హోల్ సేల్ ద్రవ్యోల్భణం ఏడాది ప్రాతిపదికన 1.95 శాతంగా ఉంది. అప్పుడు 13.50 శాతంగా అంచనా వేయగా, అంతకు మించింది. ప్రధానంగా ఆహారపదార్థాల ధరలు 9.24 శాతం పెరగడం ప్రభావం చూపింది. డిసెంబర్ 2021లో ద్రవ్యోల్భణం నాలుగు నెలల కనిష్టస్థాయికి రావడం ఊరట.

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గాయి. గత ఏడాది మార్చి నెలలో హోల్ సేల్ ద్రవ్యోల్భణం 7.89 శాతంగా ఉండగా, ఏప్రిల్ నుండి రెండంకెల్లో నమోదవుతూ వస్తోంది. నవంబర్ నెలలో ఇది 14.23 శాతంగా ఉంది. నవంబర్ నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్భణ రేటు 4.88 శాతం కాగా, డిసెంబర్ నెలలో 9.56 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 31.56 శాతానికి పెరిగింది.

December Wholesale Inflation Marginally Cools To 13.56 inflation

ఉత్పత్తి ఆధారిత వస్తువుల ధరలు తగ్గాయి. నవంబర్ నెలలో ఈ ద్రవ్యోల్భణం 11.92 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 10.62 శాతానికి తగ్గింది. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్భణం 32.30 శాతంగా ఉంది. నవంబర్ నెలలో 39.81 శాతంతో పోలిస్తే ఇది తగ్గింది.

2020 డిసెంబర్ నుండి హోల్ సేల్ ద్రవ్యోల్భణం ఇలా ఉంది.. 2020 డిసెంబర్‌లో 1.22 శాతం, 2021 జనవరిలో 2.03 శాతం, ఫిబ్రవరిలో 4.19 శాతం, మార్చిలో 7.39 శాతం, ఏప్రిల్‌లో 10.49 శాతం, మేలో 12.90 శాతం, జూన్‌లో 12.10 శాతం, జూలైలో 11.20 శాతం, ఆగస్ట్‌లో 11.39 శాతం, సెప్టెంబర్‌లో 10.70 శాతం, అక్టోబర్‌లో 12.50 శాతం, నవంబర్‌లో 14.23 శాతం, డిసెంబర్‌లో 13.56 శాతంగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+