December 1: డిసెంబర్ 1 నుంచి మారుతున్న కొత్త రూల్స్! ఇవి చేయకపోతే ఫైన్ తప్పదు!
నవంబర్ నెల ముగుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో డిసెంబర్(December 1) నెల మొదలుకానుంది. నెల మార్పు అంటే కేవలం క్యాలెండర్‌లో తేదీ మారడం మాత్రమే కాదు, ప్రభుత్వపరంగా కొన్ని ముఖ్యమైన రూల్స్ మారే అవకాశం ఉంది. మరి డిసెంబర్ 1 నుంచి ఏయే రూల్స్ మారుతున్నాయో తెలుసుకుందామా?

1. EPFO నుంచి UPS కు మారాలా?
మీరు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి అధిక పెన్షన్ కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కు మారాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు కేవలం నవంబర్ 30 వరకు మాత్రమే గడువు ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కు మారాలనుకునే ఉద్యోగులు ఈ తేదీలోగా అప్లై చేసుకోవాలి. వాస్తవానికి ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియాల్సి ఉండగా దాన్ని నవంబర్ 30 వరకు పొడిగించారు.
2. టీడీఎస్ (TDS) స్టేట్‌మెంట్
మీరు అక్టోబర్ 2025లో ఏదైనా లావాదేవీపై సెక్షన్ 194-IA, 194-IB, 194M లేదా 194S కింద టీడీఎస్ చేసి ఉంటే ఆ తగ్గింపుకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. గడువులోగా స్టేట్‌మెంట్ దాఖలు చేయకపోతే జరిమానా లేదా వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.
3. అంతర్జాతీయ లావాదేవీలకు ITR
మీ వ్యాపారం లేదా ఆదాయంలో అంతర్జాతీయ లావాదేవీలు ఉన్న పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 92E కింద తప్పనిసరిగా డాక్యుమెంట్‌లను సమర్పించాలి. దానికి లాస్ట్ డేట్ నవంబర్ 30. ఈ గడువును దాటితే భారీగా నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే మీ పత్రాలను సమర్పించడం చాలా ముఖ్యం.
ఇవి కూడా..
- ఇకపోతే డిసెంబర్ 1 నుంచి మరికొన్ని ఆర్థిక అంశాలు మారబోతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి కొత్త LPG సిలిండర్ ధరలు అమలులోకి వస్తాయి. అయితే డిసెంబర్‌లో ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది అప్పటి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
- డిసెంబర్ 1 నుంచి విమాన టికెట్ ధరలు కూడా మారొచ్చు. ఎందుకంటే విమాన టికెట్ ధరలను ప్రభావితం చేసే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధరలను కూడా ప్రతి నెలా మొదటి తేదీన సవరిస్తారు. ఒకవేళ డిసెంబర్‌లో ATF ధర పెరిగితే విమాన టికెట్లు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. అదే ATF ధర తగ్గితే, ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తుంది.
మర్చిపోవద్దు..
మీరు పెన్షన్ పత్రాలను అప్‌డేట్ చేసినా, ట్యాక్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా లేదా ప్రభుత్వ పథకాన్ని ఎంచుకున్నా... నవంబర్ 30 అనేది లాస్ట్ డేట్ అని గుర్తుంచుకోండి. ఈ గడువు ముగిస్తే డిసెంబర్ 1 నుంచి కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోవచ్చు. లేదా జరిమానాలు చెల్లించవలసి రావొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా గడువు లోపే మీ పనులను పూర్తి చేయడం ముఖ్యం.


Click it and Unblock the Notifications