IPO News: తొలిరోజే ఐపీవో షాక్.. లిస్టింగ్ తర్వాత ఎగబడి అమ్మకాలు, మీరూ బెట్ వేశారా?
Deccan Transcon Leasing IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు లిస్టింగ్ కోసం రెండు ఐపీవోలు వచ్చాయి. అయితే మెయిన్ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు మంచి లాభాలను అందించింది. అయితే ఈ క్రమంలో అడుగుపెట్టిన ఎస్ఎమ్ఈ ఐపీవో మాత్రం ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది డెక్కన్ ట్రాన్స్‌కాన్ లీజింగ్ కంపెనీ ఐపీవో గురించే. ఎన్ఎస్ఈలో అడుగుపెట్టిన ఐపీవో అమ్మకాల ఒత్తిడిని లిస్టింగ్ తర్వాత చూసింది. ఇన్వెస్టర్లు షేర్లు అమ్మకానికి దూకుడుగా దిగటంతో కొద్దిసేపటికే లోయర్ సర్క్యూట్ లో లాక్ అయ్యింది. పెట్టుబడిదారుల కోసం సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 19 వరకు అందుబాటులో ఉన్న ఐపీవో ఈ క్రమంలో రూ.65.06 కోట్లను విజయవంతంగా మార్కెట్ల నుంచి సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ స్వల్పంగా 7 శాతం ప్రీమియం ధర రూ.116 వద్ద లిస్టింగ్ అయ్యింది. ఆ తర్వాత ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.117.90 ధరను తాకింది.

అయితే పెట్టుబడిదారులు అమ్మకానికి దిగటంతో షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ.110.20 స్థాయికి దిగజారాయి. కంపెనీ తన ఐపీవో ఇష్యూ కోసం ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.102-108గా ప్రకటించింది. అలాగే కనీస పెట్టుబడి కోసం లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక్క లాట్ కొనుగోలు చేయటానికి రూ.1.29 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ తాజా ఐపీవోలో 55.24 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద 5 లక్షల షేర్లను విక్రయానికి ఉంచింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.15.12 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. అడపాదడపా ఐపీవోలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తున్నప్పటికీ బెట్టింగ్ వేసేవారి సంఖ్యలు మాత్రం తగ్గటం లేదు.
కంపెనీ వ్యాపారం..
డెక్కన్ ట్రాన్స్‌కాన్ లీజింగ్ కంపెనీ ఫిబ్రవరి 2007లో స్థాపించబడింది. కంపెనీ ట్యాంక్ కంటైనర్‌లను లీజుపై అందించే వ్యాపారంలో కొనసాగుతోంది. వివిధ రంగాల్లోని క్లయింట్‌లకు లాజిస్టిక్స్, సప్లై చెయిన్ పరిష్కారాలను అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ దేశీయ ట్యాంక్ కంటైనర్ లాజిస్టిక్స్, ట్యాంక్ ఫ్లీట్ మేనేజ్‌మెంట్, కస్టమ్స్ క్లియరెన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, నాన్-వెసెల్ ఆపరేటింగ్ కామన్ క్యారియర్స్ సేవలతో సహా సమగ్ర సరుకు రవాణా, షిప్పింగ్ పరిష్కారాలను అందిస్తోంది. కంపెనీ గడచిన ఏడాది దాదాపు 884 మంది కంటే ఎక్కువమంది కస్టమర్లకు సేవలను అందించింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా వచ్చే డబ్బును ట్యాంక్ కంటైనర్ల సేకరణ కోసం, రోజువారీ వ్యయాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications