Multibagger Stock: రూ.300 నుంచి రూ.10,170కు చేరుకున్న మల్టీబ్యాగర్.. అప్పులు అస్సలు లేవు.. కొనొచ్చా..?
Multibagger Stock: సాధారణంగా ఉండే మల్టీబ్యాగర్ స్టాక్స్ కంటే ఇప్పుడు తెలుసుకోబోతున్న కంపెనీ షేర్లు కొంత డిఫరెంట్. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల ఊహలకు అందని రీతిలో ఈ షేర్ ధర పెరిగింది. అసలు ఈ స్టాక్ ప్రత్యేకతలు ఏమిటి..? ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా..? లేదా..? అనే అంశాలు గమనిద్దాం..

కంపెనీ వివరాలు..
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ZF కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ గురించే. ఈ కంపెనీ పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీ, కమర్షియల్ అండ్ ప్యాసింజర్ వాహనాల కోసం పరిష్కారాలను అందించే సాంకేతిక సంస్థ. వెహికల్ మోషన్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ సేఫ్టీ, ఆటోమేటెడ్ డ్రైవింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో కంపెనీలకు సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19,094.38 కోట్లుగా ఉంది.

లక్షను రూ.34 లక్షలుగా మార్చి..
2008లో ZF కమర్షియల్ కంపెనీ షేర్ ధర అక్టోబర్ 3న రూ.299.35గా ఉంది. అప్పుడు కంపెనీలో లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగించిన వారికి ఏకంగా రూ.34 లక్షలు ఆదాయం వచ్చి ఉండేది. అందుకే మంచి కంపెనీలను ఎంచుకుని దీర్ధకాలం పెట్టుబడిని కొనసాగించాలని నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం స్టాక్ ధర రూ.10,015.35గా ఉంది. ఈ స్టాక్ తన పనితీరుతో తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.10,222.95 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.6,876.50గా ఉంది.

బలమైన లాభాలు..
2023 ఆర్థిక సంవత్సరం మెుదటి క్వార్టర్ లో కంపెనీ అమ్మకాలు రూ.798.42 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి ఇది రూ.491.91 కోట్లుగా ఉంది. అయితే ఖర్చుల తర్వాత పన్నులు చెల్లించటానికి ముందు లాభం Q1FY23లో రూ.86.08 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఈ సమయానికి PBT లాభం కేవలం రూ.30.85 కోట్లుగా ఉంది.

షేర్లను కొనుగోలు చేయెుచ్చా..?
బ్రోకింగ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ ప్రకారం.. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల డొమైన్‌లోని పరిష్కారాలు అందిస్తున్నందున ZFCV భారీగా లబ్ధి పొందుతోందని వెల్లడించింది. బ్రోకరేజ్ తన రీసెర్చ్ ప్రకారం షేర్ కు BUY రేటింగ్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ రానున్న కాలంలో రూ.12,160కు చేరుకుంటుందని అంచనా వేసింది. గతంలో ఈ కంపెనీ షేర్ కు ఐసీఐసీఐ రూ.10,530 టార్గెట్ ధరగా ఇచ్చింది.

అప్పులు లేని స్టాక్..
ప్రస్తుతం ఇన్ఫాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేయటం ఈ కంపెనీకి బాగా కలిసొస్తోంది. M&HCV ట్రక్ స్పేస్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం EV భాగాలు, ESC, T-EBS, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సర్వీస్ కోసం అవసరమైన సాంకేతికత అందించటంలో కంపెనీ అగ్రగామిగా ఉంది. కంపెనీ యాజమాన్యం పనితీరు కూడా అద్భుతంగా ఉండటం కంపెనీకి వృద్ధిని వేగవంతం చేసింది. పైగా కంపెనీకి ఎలాంటి అప్పులు లేకపోవటం వల్ల అనేక మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కంపెనీలో కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications