Bonus Shares: ప్రతిసారి మనం మల్టీబ్యాగర్ రాబడులను అందించే షేర్ల గురించి వింటూనే ఉంటాం. అదే సమయంలో స్మాల్, పెన్నీ క్యాప్ స్టాక్స్ లాభాలతో పాటు భారీగా నష్టాలను కలిగించే ప్రమాదం ఉంటుందని చర్చించుకుంటూనే ఉంటాం. అలా ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసిన ఒక స్మాల్ క్యాప్ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్త, అప్రమత్తత పెట్టుబడుల్లో అవసరమని చెబుతున్న ఈ స్టాక్ బోనస్ షేర్లను అందిస్తోంది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది స్మాల్ క్యాప్ కంపెనీ డెబాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించే. ఈ కంపెనీ ఏడాది ప్రాతిపదికన తన ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డ్ ఒక్కో షేరుకు మరో షేర్ బోనస్ రూపంలో అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇందుకోసం రికార్డు తేదీని నిర్ణయించారు.

ఈరోజు ముఖ్యం..
కంపెనీ అక్టోబర్ 27, 2022ని రికార్డ్ తేదీగా నిర్ణయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సెబీకి తెలిపింది. అంటే ఈ రోజు ఎవరైతే కంపెనీ బుక్స్ ప్రకారం షేర్లను కలిగి ఉంటారో వారికి మాత్రమే బోనస్ షేర్లు లభిస్తాయి. కంపెనీ మెుత్తం 3,82,20,000 ఈక్విటీ షేర్లను బోనస్ రూపంలో ఇన్వెస్టర్లకు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఒక్కరోజులో తారుమారు..
ఏడాది ప్రాతిపదికన కంపెనీ షేర్లు 91 శాతం పతనం కావటంతో అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.15,000కు పడిపోయింది. ఏడాది కిందట రూ.147గా ఉన్న కంపెనీ షేర్ ధర పతనం కారణంగా ప్రస్తుతం రూ.12.25కి పడిపోయింది. ఈ రోజు Debock Industries Ltd స్టాక్ మార్కెట్ ప్రారంభంలో 23 రూపాయల నుంచి 47 శాతం పతనమై మధ్యాహ్నం 12.07 గంటలకు రూ.12.25 లకు చేరుకుంది.

కంపెనీ వ్యాపారం..
డెబాక్ గ్రూప్ 2007లో స్థాపించబడింది. దేశానికి అత్యుత్తమ సేవలు, నాణ్యమైన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఇది ప్రారంభిచబడింది. ఈ సంస్థ గ్రూప్ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఆసక్తిని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి వివిధ దశల్లో 5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంది.
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..



Click it and Unblock the Notifications