SBI కస్టమర్లకు హెచ్చరిక! కార్డు మార్చుకునేందుకు రేపే ఆఖరు తేదీ
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అకౌంట్ కలిగిన వారికి హెచ్చరిక! మీ వద్ద ఇంకా మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులు ఉంటే వాటిని మార్చుకోవడానికి రేపే చివరి తేదీ. జనవరి 1వ తేదీ నుంచి మ్యాగ్‌స్ట్రిప్ కలిగిన డెబిట్ కార్డులను ఎస్బీఐ బ్లాక్ చేస్తుంది. దీంతో డిసెంబర్ 31వ తేదీలోగా ఈ కార్డులు మార్చుకోవాలని, కొత్త EVM చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డులను తీసుకోవాలని బ్యాంకు మరోసారి సూచించింది.
కొత్త కార్డుల కోసం అకౌంట్ హోల్డర్స్ తమ హోమ్ బ్రాంచీలో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు మోసపూరిత ట్రాన్సాక్షన్స్ నుంచి కస్టమర్ల సేఫ్టీ కోసం ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో EVM చిప్ కార్డును తీసుకుంటేనే మీ కార్డు పని చేస్తుంది.

హోం బ్రాంచీలో తీసుకోవాలి
EVM చిప్ కార్డులు లేని SBI కస్టమర్లు హోమ్ బ్రాంచీకి వెళ్లి తమ మ్యాగ్‌స్ట్రిప్ కార్డు స్థానంలో వీటిని మార్చుకోవచ్చు. మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో EVM చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఎస్బీఐ తమ కస్టమర్లకు పదేపదే విజ్ఞప్తి చేసింది. డిసెంబర్ 31 తేదీలోపు కార్డులు మార్చుకోవాలి. ఆ తర్వాత వ్యాలిడిటీతో సంబంధం లేకుండా కార్డులు డీ-యాక్టివేట్ చేస్తారు. కాబట్టి ఈవీఎం చిప్ కార్డులు తీసుకోవాలి.

ఆన్ లైన్ ద్వారా..
కొత్త EVM చిప్ కార్డుల కోసం కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏస్బీఐ కస్టమర్లు https://www.onlinesbi.com/కు వెళ్లి ATM Card Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో సూచనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకోవాలి.

యోనో ద్వారా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ Yono app ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాగ్‌స్ట్రిప్‌కు బదులు ఈవీఎం చిప్ కార్డు తీసుకోవడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉచితంగా బ్యాంకు అందిస్తుంది. కాగా, కార్డు రిజిస్టర్డ్ చిరునామాకు వస్తుంది. కాబట్టి అడ్రస్ మారితే అప్ డేట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications