మార్చి 16వ తేదీ నుండి మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు మరింత సురక్షితం కానున్నాయి. బ్యాంకింగ్ మోసం, కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల అనేక చర్యలు చేపట్టింది. మార్చి 16వ తేదీ నుండి బ్యాంకులు జారీ చేసే అన్ని కొత్త డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) వద్ద మాత్రమే అనుమతి కలిగి ఉంటాయి. కస్టమర్ ఎవరైనా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కోసం కార్డును ఉపయోగించాలనుకుంటే కార్డుదారు బ్యాంకును తప్పనిసరిగా సంప్రదించాలి.

16వ తేదీ నుండి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కుదరకపోవచ్చు
అనుచితంగా కార్డులను వాడటం, బ్యాంకింగ్ మోసాలను అడ్డుకునేందుకు అన్ని బ్యాంకులు ఆర్బీఐ కొన్ని నిబంధనలకు జారీ చేసింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉన్నప్పటికీ 16వ తేదీ నుండి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కుదరకపోవచ్చు. అంటే ఆ రోజు నుండి డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ కోసమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉండవచ్చు. ఏటీఎం లేదా PoSల వద్ద మాత్రమే వాడుకోవచ్చు.

కొత్త కార్డులు, రెన్యూవల్స్ చేసుకుంటే..
ఇకపై జారీ చేసే కొత్త కార్డులు, కాలపరిమితి ముగిసిన కార్డులను రెన్యూవల్ చేసుకున్నప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయినప్పటికీ కస్టమర్ ఆన్‌లైన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే బ్యాంకు అనుమతి తీసుకోవాలి.

బ్యాంకులకు అధికారం..
ఆర్బీఐ నిబంధనల మేరకు నష్టభయాన్ని బేరీజు వేసుకొని ప్రస్తుతం ఉన్న కార్డుల్లో ఆన్‌లైన్, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్‌ను డీయాక్టివేట్ చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది.

కార్డులు ముందే తీసుకున్నా.. అలా ఉపయోగించకుంటే..
ఇంతకుముందు తీసుకున్న కార్డుల ద్వారా ఇప్పటి వరకు ఆన్‌లైన్, ఇంటర్నేషనల్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేయకపోయినా బ్యాంకులు ఈ సదుపాయాలను డీయాక్టివేట్ చేస్తాయి.

ఏటీఎం ద్వారా స్విచ్ఛాఫ్, ఆన్
ఇక ముందు కస్టమర్లు తమ కార్డులను సంబంధిత ఏటీఎంల ద్వారా స్విచ్ ఆఫ్ లేదా స్విచ్ ఆన్ చేసుకునే సౌకర్యం కలిగిస్తున్నాయి. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుంటే ఆ సదుపాయం ప్రయోజనకరం. ఇప్పటికే ఎస్బీఐ చాలామంది కస్టమర్లకు కొన్ని సదుపాయాలను డిజబుల్ చేసింది.

బ్యాంకును సంప్రదించి..
కార్డుదారులు బ్యాంకును సంప్రదించి తమ కార్డును ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ సహా వివిధ సదుపాయాల కోసం ఎనబుల్ అయ్యేలా చూసుకోవచ్చు. ఇక నుండి డిఫాల్ట్‌గా ఈ సౌకర్యం ఉండదు. ఇండియా బయట కార్డును ఉపయోగిస్తే బ్యాంకును సంప్రదించాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications