Aadhhar-PAN: దేశంలో ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి ఇచ్చిన గడువు రేపటితో(జూన్ 30)తో ముగియనుంది. గడువు లోపు ఈ పనిని పూర్తి చేయకపోతే మీ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా మారే ప్రమాదం ఉంది.
కార్డు పనిచేయకపోతే అనేక సౌకర్యాలు వినియోగదారులకు నిలిపివేయబడతాయి. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-272B ప్రకారం రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఇదే సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు చేయటం కుదరదు. బ్యాంకులో ఖాతాను నిర్వహించాలంటే మారిన కేవైసీ రూల్స్ కింద తప్పనిసరిగా పాన్ వివరాలు కస్టమర్లు అందించాల్సి ఉంది. ప్రస్తుతం జూన్ 30, 2023 వరకు అనుసంధానం కోసం రూ.1000 జరిమానాతో ఆధార్-పాన్ కార్డ్‌ని లింక్ చేసుకోవచ్చని గుర్తుంచుకోండి.

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ తప్పనిసరి. అలాగే టాక్స్ రిఫండ్స్ పొందాలన్నా పాన్ తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం జూలై 1, 2017 వరకు PAN కార్డ్ జారీ చేయబడిన, ఆధార్ కార్డ్‌ని కలిగి ఉన్న ప్రతి పౌరుడు వాటిని లింక్ చేయడం తప్పనిసరి. ఇదే సమయంలో అసోం, జమ్మూ & కాశ్మీర్, మేఘాలయ నివాసితులకు ఆధార్-పాన్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నాన్-రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయటం తప్పనిసరి కాదు. 80 ఏళ్లు పైబడిన వారు, గత సంవత్సరం వరకు భారత పౌరులు కాని వారికి కూడా ఇది పూర్తి చేయాల్సిన అవసరం లేదు.
పాన్-ఆధార్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలి..?
- పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయడానికి ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ వెబ్‌సైట్ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaarని సందర్శించాలి.
- పాన్ నంబర్, ఆధార్ నంబర్ వివరాలు పూరించి వ్యాలిడేట్ బటన్ నొక్కాలి. వెంటనే జరిమానా రూ.1000 చెల్లించాలని పాపప్ వస్తుంది.
- జరిమానా మెుత్తాన్ని ఎలక్ట్రానిక్ ఫామ్ లో చెల్లించిన తర్వాత తరువాతి స్టేజ్ లో లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేయవచ్చు.


Click it and Unblock the Notifications