డీమ్యాట్ అకౌంట్ కేవైసీకి సంబంధించి కాస్త ఊరట. దేశీయ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు కలిగిన కస్టమర్లకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSLC) శుక్రవారం ఊరట కల్పిస్తూ బ్యాంకుల్లో కేవైసీ (Know Your Customer) పత్రాలను సమర్పించేందుకు మూడు నెలలు పాటు గడువును పొడిగించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.
ఇదివరకు గత నెలాఖరు వరకు అంటే మార్చి 31, 2022 వరకు గడువు ఇచ్చింది. తాజాగా జూన్ 30వ తేదీ వరకు గడువును పొడిగించింది. ట్రేడర్లు తమ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కేవైసీ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. అవసరమైన కేవైసీ పత్రాలు సమర్పించాలని పలువురు స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్స్‌ను ఇప్పటికే సమాచారం పంపించారు. అయితే సంబంధిత ట్రేడర్లు, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ చేసే ఖాతాదారులు తమ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ పత్రాలను జూన్ వరకు సమర్పించవచ్చు.

సెబితో, ఎంఐఐలు, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాత డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాదారులు తమకు కేవైసీ అప్ డేట్ చేయడానికి ఒకసారి గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు ఎన్ఎస్‌డీఎల్ తెలిపింది. చాలామంది బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లకు కేవైసీ పత్రాలు అందించారు. ఆ తర్వాత కేవైసీ పత్రాలు అప్ డేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో అప్ డేట్ కోరుతోంది. పేరు, చిరునామా, పాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఆదాయ శ్రేణి తదితరాలను కేవైసీ అప్ డేట్ చేయాలి.


Click it and Unblock the Notifications