Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. డీసీఎక్స్ ఏఐ- ఫస్ట్ కస్టమర్ ఎక్సిపీరియన్స్ సెంటర్ ప్రారంభం..

ప్రపంచ కంపెనీలకు ఇండియా స్వర్గధామంగా మారింది. భారత్ లో చాలా ఎంఎన్సీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. కొత్త ప్రారంభిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబై, చెన్నై , హైదరాబాద్ నగరాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్త ఐటీ సేవల సంస్థ డీఎక్స్‌సీ టెక్నాలజీ బెంగళూరులో ఒక ఏఐ- ఫస్ట్ కస్టమర్ ఎక్సిపీరియన్స్ సెంటర్ ను ప్రారంభించింది. కంపెనీ తన అతిపెద్ద గ్లోబల్ డెలివరీ హబ్‌లలో భాగంగా భారతదేశంలో తన కంపెనీ విస్తరణను బలోపేతం చేసేందుకు ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది.

డీసీఎక్స్ టెక్నాలజీ ఇండియాలో 38,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. కాగా ఈ ఏఐ ఫస్ట్ కస్టమర్ ఎక్సిపీరియన్స్ సెంటర్ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీన్ని ఏఐ ద్వారా వినియోగదారులకు సహాయపడేలా రూపొందించారు. బెంగళూరులోని ఏఐ ఫస్ట్ కస్టమర్ ఎక్సిపీరియన్స్ సెంటర్ లో ప్రత్యేకమైన ఏఐ హబ్ ఉంటుంది. అలాగే సైబర్ రేంజ్, ఫోరెన్సిక్స్ ల్యాబ్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, నెట్ వర్క్ ఆపరేషన్స్ సెంటర్ ఉన్నాయి. ఇందులో ఉన్న విభాగాలు వినియోగదారులకు సేవలు అందించనున్నాయి.

DCX

ముఖ్యంగా ఏఐ-ఆధారిత పరిష్కారాలను చూపనున్నాయి. ఈ కేంద్రంతో మండలాలు, సహకార హబ్‌లు, ఐడియేషన్ స్టూడియోలు, సహ-సృష్టి ల్యాబ్‌లు, భాగస్వామి అనుభవ మండలాలు అనుసంధానమై ఉన్నాయి. ఈ కేంద్రంలో డీసీఎక్స్‌ బృందాలు, వినియోగదారులు, భాగస్వాములు కలిసి ఏఐ-ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడనుంది. కంపెనీ ఏఐ వ్యూహంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని డీఎక్స్‌సీ టెక్నాలజీ కన్సల్టింగ్ & ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ రామ్‌నాథ్ వెంకటరామన్ అన్నారు.

తమ కొత్త కస్టమర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించడానికి ఉపయోగపడనుంది. సంస్థలు AI వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డీసీఎక్స్ టెక్నాలజీ ఆసియా పసిఫిక్ & జపాన్ ప్రెసిడెంట్ రాబ్ లే బస్క్ తెలిపారు. ఏఐ సామర్థ్యం గల వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇది ఇంజనీరింగ్, ఆపరేషన్స్ సామర్థ్యాలను ఒకే గొడుగు కింద ఈ కేంద్రం ఉపయోగపడనుందని చెప్పారు. కాగా ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా చాలా మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+