Adani Deal: ఒకప్పుడు దివంగత ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా ఇన్వెస్ట్ చేసిన స్టాక్ లో పెట్టుబడి పెట్టారు. అలాంటి కంపెనీ ఫండమెంటర్స్ గురించి ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ క్రమంలో తాజా డీల్ వార్తలతో స్టాక్ రాకెట్ వేగంతో పైపైకి పరుగెడుతోంది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది డీబీ రియల్టీ కంపెనీ షేర్ల గురించే. ఈ రోజు మార్కెట్లో కంపెనీ షేర్లు అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ ముంబై రియల్టీ స్టాక్ ధర రూ.89.25 వద్ద ఉంది. దీనికి కారణం ఏమిటంటే.. DB రియాల్టీ జాయింట్ వెంచర్ రేడియస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను గౌతమ్ అదానీ కొనుగోలు చేయటమే.

డీల్ వివరాలు..
గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గుడ్‌హోమ్స్.. దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ అయిన రేడియస్ ఎస్టేట్స్ & డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలు చేస్తోంది. వివరాల ప్రకారం అదానీ గ్రూప్ రుణదాతలకు 4 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ముందుకొచ్చింది. రేడియస్ ఎస్టేట్స్ మరియు డెవలపర్స్ ప్రైవేట్, MIG(బాంద్రా) రియల్టర్లు మరియు బిల్డర్లు జాయింట్ వెంచర్లు. ఇది డీబీ రియల్టీకి అనుబంధ సంస్థ. అదానీ గ్రూప్ తెచ్చిన ఈ రిజల్యూషన్ ప్లాన్ ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించిన సంగతి తెలిసిందే.

అదానీ గ్రూప్ కు లాభం..
తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ టెన్ BKC ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకోనుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అనేక స్థానిక, ప్రపంచ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబై ధారవికి సమీపంలో ఇది ఉంది. ధారావి పునర్నిర్మాణ కాంట్రాక్టును అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ మెుత్తం ఐదు ఎకరాల్లో విస్తరించి ఉండగా.. పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్టు రూ.25 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది.

దూసుకెళ్తున్న స్టాక్..
ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యింది. మార్కెట్లు ముగిసే సమయానికి నేడు స్టాక్ ధర రూ.89.25గా ఉంది. మహారాష్ట్ర కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.138.70 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.51.05గా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications