Hyderabad: హైదరాబాదులో ఉర్సా క్లస్టర్స్ జేటా సెంటర్.. రూ.5000 కోట్ల పెట్టుబడి..

Davos 2025: ఈసారి తెలంగాణ ప్రభుత్వం దావోస్ పర్యటన పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. గత ఏడాది కంటే దాదాపు 4 రెట్లు అధికంగా ఈ సారి పెట్టుబడులను ఆకర్షించటంలో సీఎం రేవంత్ రెడ్డీ సఫలీకృతం అయ్యారు. ప్రధానంగా డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఐటీ రంగాల్లో పెద్ద పెట్టుబడులు రావటం గమనార్హం. దీంతో హైదరాబాదుకు ఉన్న క్రెడిబిలిటీ ప్రపంచ వేదికపై మరోసారి నిరూపించబడింది.

తాజాగా అమెరికాకు చెందిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ తెలంగాణలో అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించేందుకు ముందుకొచ్చింది. దీనికి సంబంధించి దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ సీవోవో సతీష్ అబ్బూరి, సీఆర్వో ఎరిక్ వార్నర్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాదులో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని కంపెనీ వెల్లడించింది.

Davos 2025 Ursa Clusters investing 5000 cr in Hyderabad for Data centers setup Know details

హైదరాబాదులో ఏర్పాటు చేసే డేటా సెంటర్లలో హైబ్రిడ్ ఏఐ చిప్‌లను ఉపయోగించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. ఉర్సాతో భాగస్వామ్యం పంచుకోవటంతో అత్యాధునిక సాంకేతికత రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఫ్యూచర్ సిటీ కలలకు కంపెనీ కొత్త పెట్టుబడి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం అత్యంత విజయవంతమైన దావోస్ పర్యటనను రూ.1,78,950 కోట్ల మేర పెట్టుబడులను అందుకుని విజయవంతంగా తమ టూర్ ముగించింది. దీని ద్వారా 50,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలుస్తోంది. అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడుల విభజనలో అమెజాన్ రూ.60,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్ రూ.45,500 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15,000 కోట్లు, మేఘ ఇంజనీరింగ్ రూ.15,000 కోట్లు ఉండగా మరిన్ని పెట్టుబడులు కూడా వచ్చాయి.

ఇదే క్రమంలో ఐటీకంపెనీలు సైతం బెంగళూరును పక్కనబెట్టి తమ వ్యాపారాన్ని హైదరాబాద్ కేంద్రంగా వృద్ధి చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో టాప్ టెక్ కంపెనీలు కీలక పెట్టుబడి ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా హెచ్సీఎల్ టెక్ 5000 ఉద్యోగాలు, ఇన్ఫోసిస్ 17,000 ఉద్యోగాలు, విప్రో 5000 ఉద్యోగాలను కల్పించటానికి విస్తరణ బాట పడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డేటా సెంటర్లు తెలంగాణకు చాలా గొప్ప లాభాలను అందించిన ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. అమెజాన్, టిల్మాన్, ఉస్రా, CrtlS, సిఫి కొత్త సౌకర్యాలు,విస్తరణల కోసం పెట్టుబడులు పెట్టే ప్రణాళికలతో వచ్చాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+