Davos 2025: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వార్తా పత్రిక చూసినా, ఏ వార్తా ఛానెల్ పెట్టినా వినిపిస్తున్న మాట ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనలే. వారు ఏఏ కంపెనీలతో చర్చలు జరిపారు, ఎంత మేర పెట్టుబడులను ఆకర్షించారు. ఈ క్రమంలో ఎవరెవరితో ఎంఓయూలు సంతకాలు చేసుకున్నారన్న విషయాలు ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి.
వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం 2024లో దావోస్ పర్యటనలో దాదాపు రూ.40,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈసారి తమ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులను సాధించటం లక్ష్యంగా దావోస్ పర్యటనను కొనసాగిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ లో ఈ సారి ఇప్పటి వరకు 14 కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.

గతసారి పర్యటనలో 18 ప్రాజెక్టుల్లో 17 ఇప్పటికే వేరువేరు అమలు దశల్లో ఉన్నాయని చెప్పారు. కేవలం అదానీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు మాత్రమే పట్టాలు ఎక్కలేదని మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దాల్చాయని వెల్లడించారు. అయితే ఈసారి తెలంగాణకు దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెట్టుబడుల విషయంలో పేటీ పడుతున్నారా అని అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి బదులిస్తూ అలాంటిదేమీ లేదని బదులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ట్రమని, వారితో పోటీపడే ఉద్ధేశం తమకు లేదని పేర్కొన్నారు. ఎవరి అనుభవం వారిదేనని చంద్రబాబు గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తాను కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలతో కాకుండా సింగపూర్, దుబాయ్, న్యూయార్క్ వంటి దేశాలతో అభివృద్ధి విషయంలో పోటీపడుతున్నట్లు రేవంత్ బదులిచ్చారు. వ్యాపారులకు అనుకూలమైన స్థలంగా తనను తాను నిరూపించుకుందని, 30 ఏళ్లుగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలసీల రూపకల్పనను తాము కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రధానంగా ఐటీ, ఫార్మా, డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, స్కిల్ డెవల్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోందని దావోస్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేవంత్ వెల్లడించారు. అనేక ఇతర రాష్ట్రాలు ఈ రంగాలపై ప్రస్తుతం పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో లేవని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తమకు ఈ రంగాల్లో ఎలాంటి పోటీ కనిపించటం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాదులో భారీగా పెట్టుబడులను పెట్టిందని, తాము ఇన్వెస్టర్లకు అనుకూలమైన పాలసీలను తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications