Amazon: తెలంగాణలో అమెజాన్ రూ.60,000 కోట్ల పెట్టుబడి.. డేటా సెంటర్ల ఏర్పాటు ఎక్కడంటే?

Davos 2025: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఫలవంతంగా కొనసాగుతోంది. ఈసారి దావోస్ నుంచి దాదాపు లక్ష కోట్ల పెట్టుబడుల ఆకర్షనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం పేర్కొనగా.. ప్రస్తుతం అది వాస్తవ రూపం దాల్చింది. కొనసాగుతున్న పెట్టుబడుల వెల్లువతో లక్ష కోట్లకు పైగా ఎంవోయూలు జరిగాయి.

తాజాగా దావోస్‌లో తెలంగాణ మరో భారీ పెట్టుబడిని తన ఖాతాలో వేసుకుంది. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం అమెజాన్ పెద్ద పెట్టుబడి ప్రకటన చేసింది. హైదరాబాదులో రూ.60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించింది. దీంతో పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. దీంతో తెలంగాణ ఇప్పటి వరకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇవి 46 వేల మందికి ఉపాధిని కల్పిస్తాయని తెలుస్తోంది.

Davos 2025 Amazon Web Services announced 60000cr investment in Hyderabad for Data Centers

అమెరికా తర్వాత తెలంగాణలో ఎక్కువగా పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భేటీ తర్వాత తాజా ప్రకటన వెల్లడైంది. డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ ఈమేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తాజా పెట్టుబడిని ప్రకటించింది.

ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీల వినియోగం, ఆవిష్కరణలు, పెట్టుబడులు పెరుగుతున్న వేళ అమెజాన్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లు కీలకంగా మారుతాయని తెలుస్తోంది. రాష్ట్రాంలో తన క్లౌడ్ ఇన్‌ఫ్రా అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్లు పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు కంపెనీ గతంలో నిర్మించిన మూడు డేటా సెంటర్లు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి.

తాజా పెట్టుబడులకు అవసరమైన భూముల కేటాయింపులను పూర్తి చేయాలని అమెజాన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలసీలతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి అంగీకరించటంతో మరో భారీ పెట్టుబడి హైదరాబాదు ఖాతాలో పడింది. ఈ భారీ పెట్టుబడి ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డేటా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ డేటా సెంటర్ల ఏర్పాటుకు పెద్ద హబ్ కానుందని నిపుణులు భావిస్తున్నారు. నైపుణ్యాలు కలిగిన టెక్కీలకు ఇది మంచి ఉపాధి అవకాశాలను తెస్తుందంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+