Solar Cell Unit: ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే.. దావోస్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హవా నడుస్తోందని వర్షంలా వస్తున్న పెట్టుబడులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దావోస్‌లో రూ.1.64 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పెట్టుబడిదారులు బ్రాండ్ హైదరాబాదుకు ఉన్న క్రేజుకు మరోసారి తమ పెట్టుబడులతో ఇన్వెస్టర్లు పట్టం కట్టారని ఇది నిరూపించింది.
ఈ క్రమంలోనే తెలంగాణలో అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ తెలంగాణ ప్రభుత్వంతో దావోస్ వదికగా అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం గమనార్హం. కంపెనీ హైదరాబాదులో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్ అండ్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ప్రాజెక్టు కోసం కంపెనీ రూ.7000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించింది. దీని కారణంగా కొత్తగా స్థానిక యువతకు ఉపాది అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని కంపెనీ వెల్లడించింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ ఎంవోయూ కుదుర్చుకుంది. కంపెనీ తరఫున డైరెక్టర్ గిరీష్ గెల్లి హాజరయ్యారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రేరేపించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
వరుసగా వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది. రేవంత్ రెడ్డి టూర్ ఈ సారి మరింత సఫలీకృతంగా సాగిందని ఇవి నిరూపించాయి. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా హైదరాబాదును ఎంపిక చేసుకోవటానికి దోహదపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని తెలుస్తోంది. మెుత్తంగా ఇప్పటి వరకు 16 ప్రముఖ కంపెనీలతో తెలంగాణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ, ఏఐ, ఎనర్జీ, డేటా సెంటర్ల రంగాల్లో అనేక ఒప్పందాలు జరిగాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications