అమెజాన్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌ల ఆహార లైసెన్సులు రద్దు.. షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం..

ఆన్‌లైన్ కిరాణా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉదంతం కర్ణాటకలో వెలుగుచూసింది. అత్యంత విషపూరితమైన ఉమ్మెత్త (దతూరా) పండ్లు, విత్తనాలను తినదగిన ఆహార పదార్థాలుగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు తేలడంతో కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ ఉల్లంఘనకు నిరసనగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌ల ఆహార లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రద్దు చేస్తూ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆహార భద్రతాధికారులు జరిపిన సమగ్ర దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను విక్రేతలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) రిజిస్ట్రేషన్, లైసెన్స్ నంబర్లను ఉపయోగించి మరీ ప్యాక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గిడ్డంగుల్లో (వేర్‌హౌస్‌లు) వీటిని నిల్వ ఉంచి, వివిధ ఈ-కామర్స్ యాప్‌ల ద్వారా వినియోగదారులకు నేరుగా డెలివరీ చేస్తున్నారు. ఉమ్మెత్త తీవ్ర విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటుందని, దీనిని మానవ వినియోగానికి లేదా ఆహారంగా అమ్మడం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని అధికారులు హెచ్చరించారు.

Amazon food licence Instamart food licence BigBasket food licence datura sales Karnataka Karnataka datura controversy online food licence cancellation ecommerce crackdown Karnataka latest news Amazon news Instamart news BigBasket news food safety action datura sale case online sales crackdown

ఈ విషయమై ఆగస్టు 24న నిర్వహించిన విచారణకు సంబంధిత సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ విచారణలో అమెజాన్ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, తదుపరి వివరాల సమర్పణకు స్విగ్గీ సమయం కోరింది. బిగ్‌బాస్కెట్ స్పందిస్తూ తాము ఉమ్మెత్త విక్రయాలను నిలిపివేశామని, ప్యాకేజింగ్‌పై "మానవ వినియోగానికి కాదు" అని రాస్తామని తెలిపింది. అయితే ఈ కంపెనీల సమాధానాలపై ఆహార భద్రతా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మెత్త ప్రమాదకరమైన విషం కాబట్టి కేవలం లేబుల్ మార్చడం లేదా విక్రయాలు ఆపామని చెప్పడం సరిపోదని తేల్చిచెప్పింది.

Also Read

దీంతో అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు వీటికి ఉమ్మెత్త విక్రయించిన సప్లయర్లు, విక్రేతలపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద వారందరి లైసెన్సులను నిలిపివేశారు. తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఉమ్మెత్త ఉత్పత్తుల జాబితాలు, ప్రకటనలను తక్షణమే తొలగించాలని, ఇకపై ఏ రూపంలోనూ వీటికి ప్రచారం కల్పించకూడదని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ ద్వారా సరఫరా చేసిన విక్రేతల గొలుసుకట్టు జాలాన్ని పర్యవేక్షిస్తూ తనిఖీలు తీవ్రతరం చేశారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+