ముంబై: అమెరికాకు చెందిన డేటింగ్ యాప్ బంబుల్.. త్వరలో దేశీయ ఐపీఓ రంగంలోకి ప్రవేశించబోతోంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ వద్ద దరఖాస్తులను దాఖలు చేసింది. ఇప్పటికే అమెరికా స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఎంట్రీ ఇచ్చిన బంబుల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అద్భుత ఫలితాలను రాబట్టుకుంది. గత ఏడాది మొత్తానికీ 168 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది.
దేశీయ ఐపీఓ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది. డేటింగ్‌కు సంబంధించిన ఓ యాప్.. దేశీయ ఐపీఓ మార్కెట్‌లో ప్రవేశించబోతోండటం ఇదే తొలిసారి అనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి. ప్రైవేట ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ గ్రూప్‌కు చెందిన బంబుల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. కొన్నేళ్లుగా అద్భుత యూఎస్ ఎక్స్‌ఛేంజ్‌లో మెరుగైన ఫలితాలను నమోదు చేస్తోంది. 2019లో 488.9 మిలియన్ డాలర్ల రెవెన్యూను ఆర్జించింది. మరుసటి ఏడాది నాటికి ఆ మొత్తం భారీగా పెరిగింది.

జనవరి 29 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో 376.6 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఏడాది ముగిసే సరికి ఈ మొత్తం 168 బిలియన్ డాలర్లకు చేరుకుంది. నిలకడగా ఆదాయాన్ని ఆర్జిస్తుండటం వల్ల అందరి కళ్లూ ఈ యాప్ పబ్లిక్ ఇష్యూ మీదే నిలిచాయి. ఎలాంటి ఐపీఓను ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటింగ్ యాప్‌లతో పోల్చుకుంటే.. కాస్త భిన్నంగా ఉంటుంది ఇది. మహిళలు మాత్రమే దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.

డేటింగ్ యాప్‌లో సమాచారాన్ని పోస్ట్ చేయాలన్నా.. స్వీకరించాలన్నా అది మహిళలకు మాత్రమే సాధ్యపడుతుంది. పబ్లిక్ ఇష్యూను ఎప్పుడు జారీ చేస్తుందనేది స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చేనెల 14వ తేదీన ఐపీఓను జారీ చేస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదివరకు ప్రేమికుల దినోత్సవం నాడే ఆ కంపెనీ యూఎస్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో అడుగు పెట్టింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications