Q3 Results: స్టాక్ మార్కెట్ ప్రపంచంలో చాలా మందికి రాధాకిషన్ దమానీ అంటే ఒకప్పుడు బిగ్ బుల్ గురువుగా పరిచయం. కానీ ఇప్పుడు దేశంలోని ప్రతి సామాన్యుడికీ ఆయన కంపెనీ డీమార్ట్ పేరే గుర్తుకొస్తోంది.
దేశంలో డీమార్ట్ పేరుతో దమానీ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ కిరాణా స్టోర్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. తాజాగా ఈ కంపెనీ డిసెంబరుతో ముగిసిన కాలానికి తన ఆర్థిక ఫలితాలను ప్రచురించింది. వివరాల్లోకి వెడితో అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో కంపెనీ నికర లాభం రూ.690.61 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికం కంటే 9.09 శాతం అధికం.

రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం క్యూ3లో మొత్తం ఆదాయం రూ.13,291.76 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.11,345.09 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో ఆపరేటింగ్ మార్జిన్ పరిశీలిస్తే కిందట ఏడాది 8.34 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 8.25 శాతంగ నమోదైంది. స్టాండ్‌లోన్ స్థాయిలో కంపెనీ నికర లాభం ఏడాదికి 15% పెరిగి రూ.737 కోట్లకు చేరుకోగా, ఆదాయం 17% వృద్ధితో రూ.13,247 కోట్లుగా నమోదైంది. అలాగే డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కన్సాలిడేటెడ్ నికర లాభం 3 శాతం పెరిగి రూ.1,972 కోట్లకు చేరుకుంది.
ఈ త్రైమాసికంలో డీమార్ట్ మొత్తం వ్యయం, ఫైనాన్స్ వ్యయంతో కలిపి రూ.12,656.46 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో కిందటి ఏడాదితో పోల్చితే సిబ్బంది ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఏడాది కిందట రూ.192.31 కోట్లుగా ఉన్న ఈ ఖర్చులు ప్రస్తుతం రూ.234.31 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. డిసెంబర్ చివరి నాటికి డిమార్ట్ దేశవ్యాప్తంగా 341 స్టోర్లను కలిగి ఉంది. చివరి త్రైమాసికంలో కొత్తగా 9 స్టోర్లను జోడించినట్లు వెల్లడించింది. ఈ సారి పండుగ సీజన్ అమ్మకాలు నాన్-ఎఫ్‌ఎమ్‌సిజి విభాగంలో ఊహించినదాని కంటే తక్కువగా ఉన్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోన్హా వెల్లడించారు. ఇదే క్రమంలో కంపెనీ తన విస్తరణను కొనసాగించేందుకు వీలుగా కొత్త రియల్టీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూనే ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications