D Mart: ప్రముఖ వ్యాపారవేత్త స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ మనందరికీ తెలిసిన వ్యక్తే. దివంగత బిగ్ బుల్ రాకేష్ జున్ జున్ వాలాకు గురువు కూడా. ఆయనకు చెందిన రిటైల్ వ్యాపార విభాగమే డీమార్ట్.

త్రైమాసిక ఫలితాలు..
మామూలుగానే దేశంలో డీమార్ట్ స్టోర్లు ప్రజలకు చాలా చేరువ అయ్యాయి. దేశంలోని అతిపెద్ద రిటైల్ స్టోర్ల చైన్ వ్యాపారాన్ని దమానీ DMart బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్నారు. దీని మాతృసంస్థే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ పండుగ సీజన్లో బొనాంజా లాభాలను నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది.

పెరిగిన లాభాలు..
డిసెంబర్ త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ.641 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం కేవలం రూ.586 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం పెరిగి రూ.589 కోట్లకు చేరుకుంది. అలాగే ఏకేకృత ఆదాయం దాదాపుగా 25.5 శాతం పెరిగి రూ.11,569 కోట్లకు చేరుకుంది. కంపెనీ స్టాండ్‌లోన్ ఆదాయం గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,065 కోట్ల నుంచి 25 శాతం పెరిగి రూ.11,305 కోట్లకు చేరుకుంది.

టాక్సుల తర్వాత..
2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో EBITDA రూ.974 కోట్లకు పెరిగింది. ఇది గడచిన ఏడాది ఇదే కాలంలో రూ.868 కోట్లు కావటం గమనార్హం. క్యూ3లో EBITDA మార్జిన్ 9.6 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది. అయితే శుక్రవారం ముగిసిన ట్రేడింగ్ సెషన్లో ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ 1.28 శాతం క్షీణించింది. దీంతో స్టాక్ ధర రూ.3,862.20గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications