Womens day: మనిషి జీవితంలో మహిళల ప్రాధాన్యత వివరించడానికి మాటలు చాలవు. కుమార్తెగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో వారికి ఎవరూ సాటిరారు. గతంలో కేవలం వంటింటికే పరిమితమైన మహిళలు.. ప్రస్తుతం మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ముందుకు సాగుతున్నారు.
నిర్మాణ రంగం నుంచి మొదలుపెట్టి నింగిలోకి వెళ్లే వరకు వారు చూపుతున్న తెగువ.. సగటు సోమరిపోతు పురుషులకు ఓ కనువిప్పుగా నిలవాల్సిన అవసరం ఉంది. త్వరలో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మద్ధతుగా పలు సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించాయి.

లింగవివక్షను హైలెట్ చేస్తూ..
'ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే'ను పురస్కరించుకుని సిమెంట్ కంపెనీ దాల్మియా భారత్ లిమిటెడ్ ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. '#homemaker' పేరిట దీనిని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో జరుపుతోంది. 'హోమ్ మేకర్' అనే పదానికున్న సాధారణ, సాంప్రదాయక అర్థంలో తేడాని వివరిస్తోంది.
తద్వారా ఆయా వ్యాపారాలు, ఉద్యోగాల్లో చూపుతున్న లింగవివక్షను హైలెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకు. మహిళల్లోని నైపుణ్యాలను సైతం గుర్తించి, అన్ని రంగాల్లో వారికి అవకాశాలు అందించే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

టీజర్లు, షార్ట్ ఫిల్మ్స్
వరుస టీజర్లు, మహిళల అనుభవాలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఈ ప్రచారాన్ని కంపెనీ ముందుకు తీసుకు వెళ్తోంది. 'Because I'm that woman who chooses to be a #homemaker' అనే ట్యాగ్ లైన్ జతచేసింది. నిర్మాణ రంగంలోని మహిళలు తమ భవిష్యత్తును ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారో అన్న విషయాన్ని ఓ వీడియోలో చూపించింది.
మొదట ఓ మహిళను గృహిణిగా, ఇంజనీర్, కాంట్రాక్టర్, ఇళ్ల ఆర్కిటెక్ట్ గా మరోచోట చూపించింది. ఈ ప్రచారం ముఖ్యంగా లింక్డ్ ఇన్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సప్ లలో మార్చి నెలాఖరు వరకు జరగనుంది.
నిర్మాణ రంగంలోకి సాదర స్వాగతం
"నిర్మాణ రంగాన్ని క్షుణ్ణంగా గమనిస్తే, అది పూర్తిగా పురుషాధిక్యతో నిండి ఉంటుంది. భారత్ లో కేవలం 12 శాతం మంది మహిళలు మాత్రమే ఇందులో పనిచేస్తున్నారు. అవకాశాల కొరత కారణంగా వారు ఈ రంగాన్ని ఎంచుకోవడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఆ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాం. ప్రస్తుతం మేము ప్రారంభించిన ప్రచారం ద్వారా వారిని ఈ రంగంవైపు, మా సంస్థవైపు ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాం" అని దాల్మియా భారత్ లిమిటెడ్ కు చెందిన ఓ అధికారి తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications