IPO News: ఐపీవో ఇన్వెస్టర్లకు శుభవార్త.. బెట్టింగ్ వేసేందుకు 11 కంపెనీల వివరాలివే..

Upcoming IPOs: జూన్ నెల చివరివారంలో ఐపీవోల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో రానున్న వారంలో ఏకంగా బెట్టింగ్ వేసేందుకు 11 కంపెనీల ఐపీవోలు మార్కెట్లోకి వస్తున్నాయి. వివరాల ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో కూడా రానున్న వారంలో రావొచ్చని తెలుస్తోంది.

1.Trom Industries IPO: ఈ ఐపీవో జూలై 25న ప్రారంభించబడింది. జూలై 29 వరకు ఇష్యూ తెరిచి ఉంటుంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధర బ్యాండ్ రూ.100 నుంచి రూ.115గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవో లాట్ పరిమాణం 1200 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. గ్రే మార్కెట్‌లో కంపెనీ ఒక్కో షేరుకు రూ.155గా ఉంది.

Dalal street to stay busy with 11 IPos that coming next week Know details

2.Aprameya Engineering IPO: ఐపీవో జూలై 25 నుంచి జూలై 29 వరకు తెరిచి ఉండనుంది. కంపెనీ ఐపీవో ధర రూ.56 నుంచి రూ.58గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచింది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరుకు రూ.30గా ఉంది.

3.Clinitech Engineering: కంపెనీ ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.5.78 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.96గా ఉంచింది. లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. ఐపీవో ఇష్యూ 29న ముగియనుంది.

4.S A Tech Software India IPO: కంపెనీ ఐపీవో ఒక్కో షేరుకు ప్రస్తుతం రూ.70 ప్రీమియంతో గ్రేమార్కెట్లో ట్రేడవుతోంది. ఐపీవో రూ.56 నుంచి రూ.59 ప్రైస్ బ్యాండ్ ధరను నిర్ణయించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.23.01 కోట్లను సమీకరించనుంది. జూలై 26న ప్రారంభమైన ఐపీవో జూలై 30 వరకు బెట్టింగ్ వేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది.

5.Esprit Stones: కంపెనీ ఐపీవో నేడు గ్రేమార్కెట్లో రూ.54 ప్రీమియం ధరను ఒక్కో షేరుకు కలిగి ఉంది. ఈ క్రమంలో కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.82-87గా నిర్ణయించింది. అలాగే పెట్టుబడిదారులు పాల్గొనేందుకు లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా ఉంచింది. ప్రస్తుతం ఐపీవో జూలై 30 వరకు బెట్టింగ్ వేసేందుకు అందుబాటులోనే ఉండనుంది.

6.Kizi Apparels: కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.5.58 కోట్లను సేకరించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రస్తుత ఐపీవోలో 26.58 లక్షల షేర్లను జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో జూలై 30 నుంచి ఆగస్టు 1, 2024 వరకు తెరిచి ఉంటుంది. కంపెనీ లాట్ పరిమాణాన్ని 6000 షేర్లుగా ఉంచుతూ దీనికి ప్రైస్ బ్యాండ్ ధరను రూ.21గా ప్రకటించింది.

7.Akums Drugs and Pharmaceuticals: మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో మార్కెట్ల నుంచి రూ.1856.74 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో జూలై 30న తెరుచుకుని ఆగస్టు 1 వరకు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రైస్ బ్యాండ్ ధరను రూ.646 నుంచి రూ.679గా ప్రకటించింది. పెట్టుబడిదారులకు లాట్ పరిమాణాన్ని 22 షేర్లుగా నిర్ణయించగా గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.170 ప్రీమియం ధరతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

8.Ashapura Logistics: ఈ కంపెనీ ఐపీవో గ్రే మార్కెట్‌లో రూ.55 ప్రీమియంతో ట్రేడవుతోంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు తెరవబడుతుంది. ఐపీవో పరిమాణం రూ.52.66 కోట్లుగా ఉంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధర రూ.136 నుంచి రూ.144గా ప్రకటిస్తూ లాట్ పరిమాణం 1000 షేర్లుగా ప్రకటించింది.

9.Rajputana Industries: ఐపీవో రూ.43 ప్రీమియంతో ట్రేడవుతోంది. ఐపీవో జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు తెరిచి ఉంటుంది. ఐపీవో ధర బ్యాండ్ రూ.36 నుంచి రూ.38గా కంపెనీ ప్రకటించింది. అలాగే లాట్ పరిమాణం 3000 షేర్లుగా నిర్ణయించింది.

10.Bulkcorp: ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఐపీవో షేర్లు ఒక్కోటి రూ.85 ప్రీమియం ధరను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు బెట్టింగ్‌ కోసం తెరవబడింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.20.78 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. దీనికి ప్రైస్ బ్యాండ్ ధరను రూ.100 నుంచి రూ.105గా కంపెనీ నిర్ణయించింది.

11.Sathlokhar Synergys E&C Global: కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133 నుంచి రూ.140గా ప్రకటించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా ఉంచింది. ఐపీవో జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు తెరిచి ఉండనుంది. ఐపీవో పరిమాణం రూ.92.93 కోట్లుగా ఉంచింది. ఒక్కో షేరు ప్రస్తుతం గ్రేమార్కెట్లో రూ.90 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+