Stock Market: నిలిచిన బుల్ రన్.. దలాల్ స్ట్రీట్‌లో తీరు మార్చుకున్న ఇన్వెస్టర్లు..
Market Wrap: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఏడు వారాల నుంచి కొనసాగుతున్న లాభాల ర్యాలీ గతవారం ముగిసింది. వరుస పెరుగుదల తర్వాత మార్కెట్ వాల్యుయేషన్లు అమాంతం తారా స్థాయిలకు చేరుకున్నాయి.
దీంతో గడచిన వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారులు లాభాల బుక్కింగ్ కోసం ఎగబడ్డారు. ఈ కారణంగా సూచీలు భారీ నష్టాలను సైతం నమోదు చేశాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు రష్ పెరుగుదలతో బుల్స్ వెనుకడుగు వేశారు. ఈ సమయంలో నిఫ్టీ-50 సూచీలో 18 కంపెనీలు పెట్టుబడిదారులకు పాజిటివ్ రిటర్న్స్ అందించాయి.

ఒకపక్క అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం స్థాయిలు క్రమంగా అదుపులోకి వస్తున్న తరుణంలో వడ్డీ రేట్లు వచ్చే ఏడాది తగ్గొచ్చనే సంకేతాలు ఫెడ్ అందించింది. దీంతో మార్కెట్లలో ర్యాలీ నమోదైంది. అయితే కరోనా కేసులు ఒక్కసారిగా ఇండియాలో వచ్చిన కొత్త వేరియంట్ వల్ల పెరగటంతో మార్కెట్లు ప్రభావితమయ్యారు. దీనికి తోడు గ్లోబల్ ప్రఖ్యాత ఎకనమిస్టులు సైతం మార్కెట్ల ఓవర్ వాల్యుయేషన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్ కేసులు ప్రధానంగా గోవా, కేరళ, మహారాష్ట్రల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.
దీనికి తోడు ఎర్రసముద్రంలో పెరుగుతున్న దాడులు క్రూడ్ ధరలు పెరుగుదలకు కారణం అవుతున్నాయి. దీంతో చమురు ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. రానున్న వారంలో మార్కెట్లు రేంజ్ బౌండ్లో ట్రేడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల తీరుసైతం కీలకంగా మారనుంది.


Click it and Unblock the Notifications