ఏపీ-తెలంగాణలో పెరుగుతున్న ఇన్వెస్టర్లు.. ఎందుకంటే? ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తే...

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో అందరి చూపు పెట్టుబడులపై పడింది. గత కొద్ది రోజులుగా చిన్న ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. క్రమంగా చాలామంది ఈక్విటీ మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ నెలలో సెన్సెక్స్ 7.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. జూలైలోను ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మార్కెట్ జోరందుకుంది. అందుకు తగినట్లుగా కొత్త ఇన్వెస్టర్లు చేరుతున్నారు.

ముందున్న తెలుగు రాష్ట్రాలు

ముందున్న తెలుగు రాష్ట్రాలు

జూలై 20వ తేదీ నుండి జూలై 23వ తేదీ మధ్య అంటే ఈ నాలుగు రోజుల్లో ఏకంగా 1.5 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. నెల రోజుల్లో 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. బీఎస్ఈలో మొత్తం 5.2 కోట్ల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. ఏడాది కాలంలో ఈ సంఖ్య 1.3 కోట్లుగా ఉంది. ప్రతి నెల ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగు రోజుల్లో లక్షన్నర నుండి రెండు లక్షల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ కాగా, ఇందులోతెలుగు రాష్ట్రాలు కూడా ముందున్నాయి. జూలై 20 నుండి 23 మధ్య మహారాష్ట్ర నుండి 30వేల మందికి పైగా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి 10వేల చొప్పున, తెలంగాణలో 9వేల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. ఏపీ రెండో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.

పెట్టుబడులవైపు మొగ్గు ఎందుకు..

పెట్టుబడులవైపు మొగ్గు ఎందుకు..

- కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి వద్దనే ఉండటంతో చేతిలోని నగదును ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం చిక్కింది. దీంతో ఈక్విటీలు, బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.

- రియల్ ఎస్టేట్, భూములు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తం అవసరం. కానీ ఈక్విటీలో పెట్టుబడులకు చిన్న మొత్తాలు సరిపోతాయి. దీంతో ఈ లాక్ డౌన్ అనంతరం ఈక్విటీని ఎంచుకుంటున్నారు.

- మార్చిలో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆ సమయంలో పెట్టుబడుల వైపు చాలామంది ఆసక్తి కనబరిచారు.

- రికవరీ ర్యాలీ చాలామందికి సానుకూలంగా కనిపిస్తోంది.

- భారత్‌లో బెట్టింగ్ చట్టబద్దం కాకపోవడంతో ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో ట్రేడింగ్ పట్ల ఆకర్షితులయ్యారు.

11 ఏళ్ల తర్వాత...

11 ఏళ్ల తర్వాత...

మార్చి 23వ తేదీన సూచీలు కనిష్టానికి పడిపోయాయి. అప్పటి నుండి స్టాక్ మార్కెట్లు 32 శాతం మేర లాభపడ్డాయి. 2009 జూన్ సెన్సెక్స్ అత్యధికంగా 7.8 శాతం లాభపడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ నెలలో ఆ స్థాయిలో లాభాలు వచ్చాయి. జూన్ ర్యాలీ జూలైలోను కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వివిధ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే దిగ్గజ రిలయన్స్ నెల రోజుల్లోనే భారీ రిటర్న్స్ ఇవ్వగా, నిన్న లిస్ట్ అయిన రోజరీ బయోటెక్ భారీ లాభాల్లో ఉంది.

రిలయన్స్ రికార్డ్, రోజరీ ప్రారంభంలోనే జూమ్

రిలయన్స్ రికార్డ్, రోజరీ ప్రారంభంలోనే జూమ్

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. రూ.2వేలు దాటి రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి మరో 3.6 శాతం ఎగిసి రూ.2,131 పలికింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14 లక్షల కోట్లసమీపానికి చేరుకుంది. నెల రోజుల్లోనే 22 శాతం లాభపడింది.

రోజరీ బయోటెక్

రోజరీ బయోటెక్

గత అయిదేళ్ల కాలంలో లిస్టయిన తొలిరోజు 75 శాతం జంప్ అయిన రికార్డ్ సృష్టించింది రోజరీ బయోటెక్. రోజరీ బయెటెక్ షేర్ ధర ఈ రోజు మధ్యాహ్నం 1.71 శాతం ఎగిసి రూ.755 పలికింది. ఇష్యూ ధర రూ.425 కాగా నిన్న రూ.742 వద్ద ముగిసింది. ఈ రోజు మరింత ఎగిసింది. గత అయిదేళ్ల కాలంలో 11 కంపెనీలు మాత్రమే లిస్టింగ్‌లో 50 శాతానికి పైగా లాభపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తొలిరోజు 30 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+