ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పన గురించి వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ఇరు ప్రాంతాల్లో ఎన్నికల హాట్ మొదలైన వేళ.. ప్రతిపక్షాలు ఆయా ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆంధ్రాలో అయితే కొత్త కంపెనీల రాక సంగతి తరువాత, ఉన్నవాటిని సైతం జగన్ సర్కారు తరిమేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ తరహా విమర్శలకు వైకాపా ప్రతినిధులు కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. తమ వాణిని అంత బలంగా వినిపించడం లేదనే వాదన విశ్లేషకుల్లో వినిపిస్తోంది. వెయ్యి కోట్ల కంపెనీ ఆంధ్రాలో నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని సైతం ప్రారంభించగా.. కనీసం ప్రచారం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ సిటీలోని 75 ఎకరాల్లో ప్రముఖ ఎయిర్ కండీషనింగ్ ప్రొడక్ట్స్ తయారీదారు డైకిన్ తన యూనిట్ నెలకొల్పింది. 2023 చివరి నాటికి దేశంలోని తన మూడవ ప్లాంట్‌లో ప్రొడక్షన్ మొదలెట్టేందుకు ప్రణాళికలు రచించింది. దాదాపు వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఈ కంపెనీ.. రికార్డు స్థాయిలో 18 నెలల్లోనే తన యూనిట్‌ను రెడీ చేసింది. లాంఛనంగా ఇవాళ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది.
పెరుగుతున్న ఎయిర్ కండీషనర్స్ డిమాండ్‌ను తీర్చేందుకు.. తొలిదశలో ఏటా 10 లక్షల మేడిన్ ఆంధ్రా ACలను ఉత్పత్తి చేయనున్నట్లు డైకిన్ యాజమాన్యం ప్రకటించింది. దీనిద్వారా ప్రత్యక్షంగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే ఇప్పటికే 2020-21లో డిప్లమో పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినట్లు వెల్లడించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications