Dabur News: డాబర్ సంస్థలపై కేసులు.. ఉత్పత్తులపై క్యాన్సర్ ఆరోపణలు..!!

Dabur News: డాబర్ కంపెనీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన మూడు అనుబంధ సంస్థలపై యూకే, కెనడాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

కంపెనీ హెయిర్ రిలాక్సర్, హెయిర్ స్ట్రెయిట్నర్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతాయని వినియోగదారులు ఆరోపించారు. డాబర్ ఈ ఉత్పత్తులను వివిధ బ్రాండ్ పేర్లతో ఆయా దేశాల్లో విక్రయిస్తోంది. దీనిపై రెండు దేశాల్లో కలిపి ఏకంగా 5,400 కేసులు నమోదయ్యాయి. దీంతో కంపెనీ ప్రస్తుతం చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది.

Dabur subsidiaries got 5400 law suits filed in us, canada over cancer causing hair products

డాబర్ అనుబంధ సంస్థలైన నమస్తే లేబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎస్సెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్ హెయిర్ ప్రొడక్ట్స్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీనికి తోడు వారం ప్రారంభంలో డాబర్ ఇండియా రూ.321 కోట్లకు జీఎస్టీ డిమాండ్ వడ్డీ, జరిమానా నోటీసును అందుకుంది.

క్యాన్సర్ ఆరోపణలపై కంపెనీ స్పందించింది. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అసంపూర్ణ పరిశోధనల ఆధారంగా అనుబంధ సంస్థలపై కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఆరోపణలను పూర్తిగా ఖండించిన కంపెనీ కేసుల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో డాబర్ స్టాక్స్ మార్కెట్లో నష్టపోయాయి.

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫార్మాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ కెమికల్ మిథిలిన్ గ్లైకాల్ కలిగిన హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తులపై హోల్‌సేల్ నిషేధాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ హెయిర్ స్ట్రెయిటనింగ్ ఉత్పత్తులు మనుషులకు ప్రమాదకరంగా ఉండే క్యాన్సర్ కారక రసాయనాలను సృష్టించే ప్రమాదం ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+