Dabur Share: ఈ రోజు మార్కెట్లో డాబర్ ఇండియా షేర్లు నష్టపోయాయి. అయితే దీనికి ఒక కారణం ఉంది. అయితే ప్రమోటర్స్ బర్మన్ కుటుంబం బ్లాక్ డీల్ ద్వారా మంగళవారం రూ.800 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నట్లు వార్తలు రావటంతో షేర్లు నష్టాన్ని చవిచూశాయి.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కన్జూమర్ గూడ్స్ కంపెనీగా డాబర్ ఇండియా ఉంది. అయితే ప్రమోటర్ల కుటుంబం షేర్లను సోమవారం ముగింపు ధర కంటే 4 శాతం తక్కువకు విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో కరెక్షన్ అయిన స్టాక్ ధర రూ.589.05 వద్ద ముగిసింది.
సెప్టెంబర్ 30 డేటా ప్రకారం డాబర్ ఇండియా లిమిటెడ్ ప్రమోటర్లైన బర్మన్ కుటుంబానికి కంపెనీలో మొత్తం 67.24 శాతం వాటా ఉంది. డాబర్ ఇండియా బ్లాక్ డీల్‌కు గోల్డ్‌మన్ సాచ్స్ బ్రోకర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్‌లో తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిలో డాబర్ ఇండియా కూడా ఒకటిగా ఉంది. 19 డిసెంబర్ 2022 నాటికి డాబర్ ఇండియా షేర్లు కేవలం 1.5 శాతం మాత్రమే లాభపడ్డాయి.

ఇప్పటికే భారత ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్, టాటా గ్రూప్ ప్రవేశించాయి. ఇదే రంగంలో ఉన్న విప్రో సైతం కొత్తగా కేరళకు చెందిన ఒక ఆహార కంపెనీని కొనుగోలు చేసింది. రిలయన్స్ సైతం ఇండిపెండెన్స్ పేరుతో ఒక బ్రాండ్ ను త్వరలోనే భారత మార్కెట్లోకి అరంగేట్రం చేస్తోంది. ఈ పోటీని తట్టుకునేందుకు డాబర్ మసాలా దినుసుల తయారీదారు బాద్ షా లో 51 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ షేర్లను మార్చి 31, 2023 నాటికి బదిలీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
డాబర్ కంపెనీ దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ, హెయిర్ కేర్, చర్మ సంరక్షణ, టూత్‌పేస్ట్, గృహ సంరక్షణ, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులను మాత్రమే తయారు చేసి విక్రయిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications