Record Sales: ఇండియన్స్ ఎగబడి కొంటున్న డాబర్ ప్రొడక్ట్.. ఈ సేల్స్‌తో FMCG మార్కెట్ షేక్..
Record Sales: దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG) బ్రాండ్ డాబర్ ఉత్పత్తులకు ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది. 9 విభిన్న పవర్ బ్రాండ్లు దీని సొంతం. భారత్ లోని వ్యాపారాలు డాబర్ చావన్‌ప్రాష్, డాబర్ హనీ, డాబర్ హోనిటస్, డాబర్ పుడిన్‌హార, డాబర్ లాల్ టైల్, డాబర్ ఆమ్లా, డాబర్ రెడ్ పేస్ట్, రియల్ నుంచి సంస్థకు 75 శాతం ఆదాయం లభిస్తోంది. ఇవికాక మరో డాబర్ ఉత్పత్తి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
వయసుతో సంబంధం లేకుండా అందరూ వినియోగించేలా హజ్మోలా ట్యాబ్లెట్స్ ను డాబర్ ఉత్పత్తి చేస్తోంది. ఈ డైజెస్టివ్ ట్యాబ్లెట్ల తయారీకి వన మూలికలు, కొన్ని లవణాలతో పాటు వివిధ రకాలు భారతీయ స్పైసెస్ ను వినియోగిస్తోంది. ఇవి జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా గ్యాస్, అజీర్తికి మంచి మందుగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు ఇండియాలో వీటి సేల్స్ నంబర్స్ చూస్తే షాక్ అవ్వక తప్పదు.

ఇండియాలో రోజూ 2.4 కోట్ల హాజ్మోలా ట్యాబ్లెట్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. దీనివల్ల డాబర్ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. భారత్ లోని డైజెస్టివ్ ట్యాబ్లెట్ల విభాగంలో 50 శాతం వాటాతో హజ్మోలా మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. ఇది నిమ్మ, ఆరంజ్, పుదీనా, చింతపండు వంటి వివిధ ఫ్లేవర్లలో లభిస్తోంది.
హాజ్మోలా వ్యాపారం జోరుగా సాగుతుండటంతో డాబర్ పెద్ద ప్లాన్ చేసింది. దోమల నియంత్రణకు వినియోగించే ఒడోమస్ తో పాటు హాజ్మోలాను కూడా పవర్ బ్రాండ్ గా మార్చడానికి డాబర్ రెడీ అవుతోంది. అంటే ఇందుకు సంబంధించిన ప్రకటనలు, మార్కెటింగ్ కోసం పెట్టుబడిని పెంచనుంది. తద్వారా మరింత మందికి ఈ ప్రొడక్ట్ విరివిగా అందుబాటులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications